Title (Indic)ఈఁతకు మిక్కిలి లోఁతు యిఁక లేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈఁతకు మిక్కిలి లోఁతు యిఁక లేదు బాఁతిపడ నేమనఁగా భయమేల నీకు (॥ఈఁత॥) నీమనసు రావలసి నెలఁతఁ దోడితెచ్చితి యేమి సేయవలెనయ్యా ఇంకా నీకు కామించి యానతీవయ్యా కడుసిగ్గువడనేల నేమెల్లా గలుగఁగాను నీ కేమిగడను (॥ఈఁత॥) వేడుకలు గావలసి విడే లిద్దరి కిచ్చితి వోడక సేయించుకో వో యుచితా లింక చూడరాదా నాదిక్కు సూటిగా మఱఁగులేల వూడిగము నేఁజేయఁగా వొదుగ నీకేల (॥ఈఁత॥) కూటమి మీకు వలసి గొబ్బునఁ దెరవేసితి యేఁటికి నెరపరికా లింకా నీకు నీటున శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను చోటిచ్చి నే లోగఁగా సుద్దులు మరేఁటికి English(||pallavi||) īm̐tagu mikkili lom̐tu yim̐ka ledu bām̐tibaḍa nemanam̐gā bhayamela nīgu (||īm̐ta||) nīmanasu rāvalasi nĕlam̐tam̐ doḍidĕchchidi yemi seyavalĕnayyā iṁkā nīgu kāmiṁchi yānadīvayyā kaḍusigguvaḍanela nemĕllā galugam̐gānu nī kemigaḍanu (||īm̐ta||) veḍugalu gāvalasi viḍe liddari kichchidi voḍaga seyiṁchugo vo yusidā liṁka sūḍarādā nādikku sūḍigā maṟam̐gulela vūḍigamu nem̐jeyam̐gā vŏduga nīgela (||īm̐ta||) kūḍami mīgu valasi gŏbbunam̐ dĕravesidi yem̐ṭigi nĕrabarigā liṁkā nīgu nīḍuna śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu soḍichchi ne logam̐gā suddulu marem̐ṭigi