Title (Indic)హీనదశలఁ బొంది యిట్ల నుండుటకంటె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) హీనదశలఁ బొంది యిట్ల నుండుటకంటె నానావిధులను నున్ననాఁడే మేలు (॥హీన॥) అరుదైన క్రిమికీటకాదులందుఁ బుట్టి పరిభవములనెల్లఁ బడితిఁ గాని యిరవైనచింత నాఁడింతలేదు యీ- నరజన్మముకంటె నాఁడే మేలు (॥హీన॥) తొలఁగక హేయజంతువులయందుఁ బుట్టి పలువేదనలనెల్లఁ బడితిఁగాని కలిమియు లేమియుఁ గాన నేఁ డెఱిఁగి నలఁగి తిరుగుకంటె నాఁడే మేలు (॥హీన॥) కూపనరకమున గుంగి వెనకకు నేఁ బాపవిధులనెల్లఁ బడితిఁగాని యేపునఁ దిరువేంకటేశ నా కిటువలె నాపాలఁ గలిగినాఁడే మేలు English(||pallavi||) hīnadaśhalam̐ bŏṁdi yiṭla nuṁḍuḍagaṁṭĕ nānāvidhulanu nunnanām̐ḍe melu (||hīna||) arudaina krimigīḍagādulaṁdum̐ buṭṭi paribhavamulanĕllam̐ baḍidim̐ gāni yiravainasiṁta nām̐ḍiṁtaledu yī- narajanmamugaṁṭĕ nām̐ḍe melu (||hīna||) tŏlam̐gaga heyajaṁtuvulayaṁdum̐ buṭṭi paluvedanalanĕllam̐ baḍidim̐gāni kalimiyu lemiyum̐ gāna nem̐ ḍĕṟim̐gi nalam̐gi tirugugaṁṭĕ nām̐ḍe melu (||hīna||) kūbanaragamuna guṁgi vĕnagagu nem̐ bābavidhulanĕllam̐ baḍidim̐gāni yebunam̐ diruveṁkaḍeśha nā kiḍuvalĕ nābālam̐ galiginām̐ḍe melu