Title (Indic)ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట యెవ్వరిఁ గొలిచిన నిది నీకొలువు (॥ఎవ్వ॥) అవయవములలో నదిగా దిదిగా- దవి మే లివి మే లన నేలా భువియుఁ బాతాళము దివియు నందలిజంతు- నివహ మింతయునూ నీదేహమేకాన (॥ఎవ్వ॥) నీవు లేనిచోటు నిజముగఁ దెలిసిన ఆవల నది గా దనవచ్చును శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూర్ణుఁడవుగాన English(||pallavi||) ĕvvarim̐ gādanna nidi ninnum̐ gādaṁṭa yĕvvarim̐ gŏlisina nidi nīgŏluvu (||ĕvva||) avayavamulalo nadigā didigā- davi me livi me lana nelā bhuviyum̐ bādāḽamu diviyu naṁdalijaṁtu- nivaha miṁtayunū nīdehamegāna (||ĕvva||) nīvu lenisoḍu nijamugam̐ dĕlisina āvala nadi gā danavachchunu śhrīveṁkaḍagiri śhrīnātha sagalamu bhāviṁpa nīve paribūrṇum̐ḍavugāna