Title (Indic)కాతరాన మోహించి కాచుకుందాన నీవేళ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కాతరాన మోహించి కాచుకుందాన నీవేళ చేతికి నీవు వరమిచ్చేదెపుడో కాని (॥కాత॥) పొలపచూపులఁజూచి బొమ్మలను జంకించి చలిమీ బలిమీని సాదించితి వలపుతేటలు చల్లి వాదించితిని నీతో కెలన నీమతి గరఁగేదెన్నఁడోకాని (॥కాత॥) చెనకి చేఁతలేసేసి సిగ్గులు సోఁకించితి ననుపు గావలెనని నవ్వు నవ్వితి మొనవాఁడి గోరితోనే మొక్కులెల్లా మొక్కితిని యెనసి నీవు లోనయ్యే దెట్లానోకాని (॥కాత॥) తగులాయములు చెప్పి తమకము గడునించి తగవులెల్లా నెరపి దైవారితి మగువనని దయతో మన్నించి కూడితి విట్టె నిగిడి శ్రీ వేంకటేశ నేర్పుయేదోకాని English(||pallavi||) kādarāna mohiṁchi kāsuguṁdāna nīveḽa sedigi nīvu varamichchedĕbuḍo kāni (||kāda||) pŏlabasūbulam̐jūsi bŏmmalanu jaṁkiṁchi salimī balimīni sādiṁchidi valabudeḍalu salli vādiṁchidini nīdo kĕlana nīmadi garam̐gedĕnnam̐ḍogāni (||kāda||) sĕnagi sem̐talesesi siggulu som̐kiṁchidi nanubu gāvalĕnani navvu navvidi mŏnavām̐ḍi goridone mŏkkulĕllā mŏkkidini yĕnasi nīvu lonayye dĕṭlānogāni (||kāda||) tagulāyamulu sĕppi tamagamu gaḍuniṁchi tagavulĕllā nĕrabi daivāridi maguvanani dayado manniṁchi kūḍidi viṭṭĕ nigiḍi śhrī veṁkaḍeśha nerbuyedogāni