Title (Indic)అప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు చెప్పరాని మాటలకు చెవియొగ్గేనయ్యా (॥అప్పు॥) యేతులకు నీవు నన్ను ఇటు నటుఁ జెనకఁగా కాతరాన నే నిన్నుఁ గాదందునా వాతులు మోవఁగ నీకు వలపులు పొంగఁగాను పోతరించి ఇచ్చకాల పూవుగట్టేనయ్యా (॥అప్పు॥) నవ్వులకు నీవు నన్ను నయములఁ దిట్టఁగాను రవ్వలుగా నే నప్పటి రాఁపుసేతునా మువ్వంక జవ్వనము మొలకలువెళ్లఁగాను నివ్వటిల్లఁ జెమటల నీరుగట్టేనయ్యా (॥అప్పు॥) చనవు చేసుక నన్ను సమ్మతించఁ గూడగాను గునిసి వేరే నిన్నుఁ గొసరుదునా తనివి శ్రీవేంకటేశ తమకపువిందులకు చనవులనే వుపచారము చెప్పేనయ్యా English(||pallavi||) appuḍu manasuvachchu nanniḍā nīgu sĕpparāni māḍalagu sĕviyŏggenayyā (||appu||) yedulagu nīvu nannu iḍu naḍum̐ jĕnagam̐gā kādarāna ne ninnum̐ gādaṁdunā vādulu movam̐ga nīgu valabulu pŏṁgam̐gānu podariṁchi ichchagāla pūvugaṭṭenayyā (||appu||) navvulagu nīvu nannu nayamulam̐ diṭṭam̐gānu ravvalugā ne nappaḍi rām̐pusedunā muvvaṁka javvanamu mŏlagaluvĕḽlam̐gānu nivvaḍillam̐ jĕmaḍala nīrugaṭṭenayyā (||appu||) sanavu sesuga nannu sammadiṁcham̐ gūḍagānu gunisi vere ninnum̐ gŏsarudunā tanivi śhrīveṁkaḍeśha tamagabuviṁdulagu sanavulane vubasāramu sĕppenayyā