Title (Indic)ఆస గలిగితే నీవూ నాతనిఁ జేసుకోరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆస గలిగితే నీవూ నాతనిఁ జేసుకోరాదా రేసు వుట్టి వలపేల రేఁచుకొనేవే (॥ఆస॥) యెలమి నెప్పుడు నా యింటనే వున్నాఁడంటా సొలసి యాతని నేమి చూచేవే నీవు పలుమారు నామీఁదనే బత్తి సేసీనంటాను వెలినుండి నీవెంత వెరగందేవే (॥ఆస॥) మచ్చిక నాతోడనే మాఁటలాడీనితఁడంటా కచ్చుపెట్టుక యేల యేఁకారేవే నీవు ఇచ్చగించి నా విన్నపా లెప్పుడూ వినీనంటా కొచ్చి కొచ్చి లోలో నేమి గుబ్బతిలేవే (॥ఆస॥) మేలువాఁడై నా యిచ్చలో మెలఁగి మన్నించీనంటా వోలి నిందుకే యట్టు నోరూరేవే నీవు యీలీల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె వేళ గాచుకొని యేమి వేసాలు సేసేవే English(||pallavi||) āsa galigide nīvū nādanim̐ jesugorādā resu vuṭṭi valabela rem̐sugŏneve (||āsa||) yĕlami nĕppuḍu nā yiṁṭane vunnām̐ḍaṁṭā sŏlasi yādani nemi sūseve nīvu palumāru nāmīm̐dane batti sesīnaṁṭānu vĕlinuṁḍi nīvĕṁta vĕragaṁdeve (||āsa||) machchiga nādoḍane mām̐ṭalāḍīnidam̐ḍaṁṭā kachchubĕṭṭuga yela yem̐kāreve nīvu ichchagiṁchi nā vinnabā lĕppuḍū vinīnaṁṭā kŏchchi kŏchchi lolo nemi gubbadileve (||āsa||) meluvām̐ḍai nā yichchalo mĕlam̐gi manniṁchīnaṁṭā voli niṁduge yaṭṭu norūreve nīvu yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ veḽa gāsugŏni yemi vesālu seseve