Title (Indic)ఆతఁడు నీవాడినట్టె అన్నిపనులనుఁ జేసు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీవాడినట్టె అన్నిపనులనుఁ జేసు శ్రీతరుణిని మమ్ము రక్షించవమ్మ (॥ఆతఁ॥) యేలవమ్మ మమ్మును యెక్కింతివి పతి వురము నీలీల లేమి సేసినా నీకుఁజెల్లును బాలకి వన్నిటా నీవు పనిగొంటి వాతనిని కీలు నీచే నున్నది రక్షించవమ్మా (॥ఆతఁ॥) మన్నించవమ్మ మమ్ము మగఁడు నీచేతివాఁడు సన్నల నీచేఁతలెల్లా సాగి వచ్చీని అన్నిటాఁ జక్కనిదాన వటమీఁదట దొరవు యెన్నికె కెక్కె నీబ్రదు కిఁకఁ గావవమ్మా (॥ఆతఁ॥) యీడేరించవమ్మ మమ్ము నిట్టె యలమేల్మంగవు గూడితి శ్రీ వేంకటేశుఁ గోరినట్టెల్లా యీడులేనిదానవు నే మూడిగాలవార మిదె వేడుక లెల్లా నీసొమ్మే వెలయించవమ్మా English(||pallavi||) ādam̐ḍu nīvāḍinaṭṭĕ annibanulanum̐ jesu śhrīdaruṇini mammu rakṣhiṁchavamma (||ādam̐||) yelavamma mammunu yĕkkiṁtivi padi vuramu nīlīla lemi sesinā nīgum̐jĕllunu bālagi vanniḍā nīvu panigŏṁṭi vādanini kīlu nīse nunnadi rakṣhiṁchavammā (||ādam̐||) manniṁchavamma mammu magam̐ḍu nīsedivām̐ḍu sannala nīsem̐talĕllā sāgi vachchīni anniḍām̐ jakkanidāna vaḍamīm̐daḍa dŏravu yĕnnigĕ kĕkkĕ nībradu kim̐kam̐ gāvavammā (||ādam̐||) yīḍeriṁchavamma mammu niṭṭĕ yalamelmaṁgavu gūḍidi śhrī veṁkaḍeśhum̐ gorinaṭṭĕllā yīḍulenidānavu ne mūḍigālavāra midĕ veḍuga lĕllā nīsŏmme vĕlayiṁchavammā