Title (Indic)నీవంటిదే కాదా నెట్టన నేఁ డాపె యాస WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవంటిదే కాదా నెట్టన నేఁ డాపె యాస దేవులవైతే మరి తెలుసుకోరాదా (॥నీవం॥) పతివద్ద నుండినభామనేల పిలిచేవే కుతిలకుడిచి వట్టి కుచ్చితానను ఆతని గూడగ నీకు ననువు గావలసితే వెతదీర నొకతెర వేసుకొనరాదా (॥నీవం॥) యింతి విడెమియ్యగాను యేల సన్నచేసేవే కాంతునిపై నీవు వట్టి కాతరానను యింతవేడుకైతే నీవు నితనిపచ్చడములో కాంతకు మఱఁగుగాను కప్పుకొనరాదా (॥నీవం॥) పరగఁ దామిద్దరునుఁ బవళించియుండఁగాను అరసేవేలే వట్టి యాగడానను గరిమ శ్రీవేంకటేశుఁ గైకొనఁగ మనసైతే నిరతి నావలిపక్క నీవుండరాదా English(||pallavi||) nīvaṁṭide kādā nĕṭṭana nem̐ ḍābĕ yāsa devulavaide mari tĕlusugorādā (||nīvaṁ||) padivadda nuṁḍinabhāmanela piliseve kudilaguḍisi vaṭṭi kuchchidānanu ādani gūḍaga nīgu nanuvu gāvalaside vĕdadīra nŏgadĕra vesugŏnarādā (||nīvaṁ||) yiṁti viḍĕmiyyagānu yela sannaseseve kāṁtunibai nīvu vaṭṭi kādarānanu yiṁtaveḍugaide nīvu nidanibachchaḍamulo kāṁtagu maṟam̐gugānu kappugŏnarādā (||nīvaṁ||) paragam̐ dāmiddarunum̐ bavaḽiṁchiyuṁḍam̐gānu arasevele vaṭṭi yāgaḍānanu garima śhrīveṁkaḍeśhum̐ gaigŏnam̐ga manasaide niradi nāvalibakka nīvuṁḍarādā