Title (Indic)నేను తనకు నెదురా నేరుపరి కడుఁ దాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేను తనకు నెదురా నేరుపరి కడుఁ దాను రానంటా నన్నేల దూరీ రతివిరహమున (॥నేను॥) పంతములాడేటివాఁడు బలిమి చూపుమనవే మంతనాన విరులేసే మరునితోను రంతులు నాతోనేల రవ్వగా వాదించుఁగాక చింతలురేఁచేయట్టిచిలుకతోను (॥నేను॥) మేరతోనేల సాదించీ మించి కోపించుమనవే సారె వెన్నెలల వేఁచే చందురుపైని గోరడి నన్నేల కొని గుంపించి పైకొనుఁగాక సారెకును విసరేటి చలిగాలిపైని (॥నేను॥) పెనఁగి కూడేటివాఁడు బీరము చూపుమనవే కినిసి తొడరేవసంతునియెదుటా యెనసి శ్రీవేంకటేశుఁ డెమ్మెలు మెరయుఁగాక వెనకముందరితనవెలఁదులయెదుటా English(||pallavi||) nenu tanagu nĕdurā nerubari kaḍum̐ dānu rānaṁṭā nannela dūrī radivirahamuna (||nenu||) paṁtamulāḍeḍivām̐ḍu balimi sūbumanave maṁtanāna virulese marunidonu raṁtulu nādonela ravvagā vādiṁchum̐gāga siṁtalurem̐seyaṭṭisilugadonu (||nenu||) meradonela sādiṁchī miṁchi kobiṁchumanave sārĕ vĕnnĕlala vem̐se saṁdurubaini goraḍi nannela kŏni guṁpiṁchi paigŏnum̐gāga sārĕgunu visareḍi saligālibaini (||nenu||) pĕnam̐gi kūḍeḍivām̐ḍu bīramu sūbumanave kinisi tŏḍarevasaṁtuniyĕduḍā yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍĕmmĕlu mĕrayum̐gāga vĕnagamuṁdaridanavĕlam̐dulayĕduḍā