Title (Indic)అపుడైనా నాపె చెప్పినట్టెల్లాఁ జేయవద్దా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అపుడైనా నాపె చెప్పినట్టెల్లాఁ జేయవద్దా నెపమున నన్నుఁ జూచి నీవు సిగ్గువడేవు (॥అపు॥) వలపులు చల్లిచల్లి వాడికగా నిన్నింటికి పిలువఁగ వచ్చెఁగా ప్రియురాలు వొలిసీనొల్లమితో నీ వూరకే వుండితేను తెలిపి నీవొడివట్టి తీసెఁగా నిన్నును (॥అపు॥) దయవుట్టఁజెప్పి నీతోఁ దమయింటఁ బెండ్లియని ప్రియమున నక్షంతలు పెట్టెంగా నీకు క్రియ యెఱిఁగియు నీవు కిమ్ములం బరాకైతే నయమున మొక్కి నంటునను వేఁడుకొనెఁగా (॥అపు॥) పెనఁగి నిన్నందలానఁ బెట్టి ఇంటి కిట్టె తెచ్చి చనవునఁ గూడెఁగా సారెసారెకు యెనసి యలమేల్ మంగ కిరవై శ్రీవేంకటేశ నను నేలితివి యాకె ననిచెఁగా నీకు English(||pallavi||) abuḍainā nābĕ sĕppinaṭṭĕllām̐ jeyavaddā nĕbamuna nannum̐ jūsi nīvu sigguvaḍevu (||abu||) valabulu sallisalli vāḍigagā ninniṁṭigi piluvam̐ga vachchĕm̐gā priyurālu vŏlisīnŏllamido nī vūrage vuṁḍidenu tĕlibi nīvŏḍivaṭṭi tīsĕm̐gā ninnunu (||abu||) dayavuṭṭam̐jĕppi nīdom̐ damayiṁṭam̐ bĕṁḍliyani priyamuna nakṣhaṁtalu pĕṭṭĕṁgā nīgu kriya yĕṟim̐giyu nīvu kimmulaṁ barāgaide nayamuna mŏkki naṁṭunanu vem̐ḍugŏnĕm̐gā (||abu||) pĕnam̐gi ninnaṁdalānam̐ bĕṭṭi iṁṭi kiṭṭĕ tĕchchi sanavunam̐ gūḍĕm̐gā sārĕsārĕgu yĕnasi yalamel maṁga kiravai śhrīveṁkaḍeśha nanu nelidivi yāgĕ nanisĕm̐gā nīgu