Title (Indic)సతుల మిందరమును సంతోసించేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సతుల మిందరమును సంతోసించేము తతివచ్చె నిఁక నిట్టె దాఁచకువయ్యా (॥సతు॥) కన్నులనే నవ్వుతాను కలకల మాటాడుతా వున్నది చెలియ నేఁడు వుల్లసానను మన్నించిననీసుద్దులు మాతోఁ జెప్ప సిగ్గువడీ అన్నియు నీవైనా నానతియ్యవయ్యా (॥సతు॥) మోమునఁ గళదేరుతా ముచ్చటలు నెరపుతా వేమారుఁ జెలరేఁగీని వేడుకలను నీమోహపుగుఱుతులు నే మడిగితే దాఁచీ ఆముకొని నీవైనా నానతియ్యవయ్యా (॥సతు॥) మోనిఁదేనె లొలుకతా ముంచిసరసమమాడుతా వోవరిలో నిన్నుఁగూడి వున్నదిపుడు శ్రీవేంకటేశుఁడ నే మెఁచితేఁ దానే తలవంచీ ఆవిధము నీవైనా నానతియ్యవయ్యా English(||pallavi||) sadula miṁdaramunu saṁtosiṁchemu tadivachchĕ nim̐ka niṭṭĕ dām̐saguvayyā (||sadu||) kannulane navvudānu kalagala māḍāḍudā vunnadi sĕliya nem̐ḍu vullasānanu manniṁchinanīsuddulu mādom̐ jĕppa sigguvaḍī anniyu nīvainā nānadiyyavayyā (||sadu||) momunam̐ gaḽaderudā muchchaḍalu nĕrabudā vemārum̐ jĕlarem̐gīni veḍugalanu nīmohabuguṟudulu ne maḍigide dām̐sī āmugŏni nīvainā nānadiyyavayyā (||sadu||) monim̐denĕ lŏlugadā muṁchisarasamamāḍudā vovarilo ninnum̐gūḍi vunnadibuḍu śhrīveṁkaḍeśhum̐ḍa ne mĕm̐sidem̐ dāne talavaṁchī āvidhamu nīvainā nānadiyyavayyā