Title (Indic)ఎచ్చట చూచినాను యివిగో నీ సుద్దులే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చట చూచినాను యివిగో నీ సుద్దులే అచ్చుగ నీ దాసులే భాగ్యవంతు లందరు (॥॥) అన్నిటాఁ జక్కనివాఁడవని నిన్ను నందరుఁ నెన్న నీదేవుల సిరు లెక్కుడందురు సన్నుతి నీసుతుల నెంచఁగ లోకేశు లందురు పన్ని నీకూఁతురు లోకపావని యందురు (॥॥) అట్టె నీ చేతిచక్రము అతిప్రతాప యందురు పట్టినసంకు వేదాలపాఠ మందురు జట్టిగ నీ పానుపు సర్వాదార మందురు వొట్టి నీవాహనము దేవో పకారి యందురు (॥॥) పరగ నీవున్న చోటే పరమపద మందురు యిరవై శ్రీవేంకటాద్రి యిక్కువందురు మరిగి యలమేలుమంగమగఁడవు నీవందురు ధర నన్ను నీదాసాన దాసుడందురు English(||pallavi||) ĕchchaḍa sūsinānu yivigo nī suddule achchuga nī dāsule bhāgyavaṁtu laṁdaru (||||) anniḍām̐ jakkanivām̐ḍavani ninnu naṁdarum̐ nĕnna nīdevula siru lĕkkuḍaṁduru sannudi nīsudula nĕṁcham̐ga logeśhu laṁduru panni nīgūm̐turu logabāvani yaṁduru (||||) aṭṭĕ nī sedisakramu adipradāba yaṁduru paṭṭinasaṁku vedālabāṭha maṁduru jaṭṭiga nī pānubu sarvādāra maṁduru vŏṭṭi nīvāhanamu devo pagāri yaṁduru (||||) paraga nīvunna soḍe paramabada maṁduru yiravai śhrīveṁkaḍādri yikkuvaṁduru marigi yalamelumaṁgamagam̐ḍavu nīvaṁduru dhara nannu nīdāsāna dāsuḍaṁduru