Title (Indic)ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనీడ నుండఁగా నిన్ననేఁ గాక కూడి యిట్టె వుండితేను కోపగించేనా (॥ఆడ॥) నామొగము చూడుమా నగితేనె కానవచ్చీ నీ మనసులోననున్న నిజముఁ గల్లా యేమతకములు నేల యింతేసి ఆనలేల నామంచముమీఁద నుంటే నమ్మ నే ననేనా (॥ఆడ॥) ముమ్మారునాడుమామాట మొదలనే తెలిసెను కమ్మిన నీచేఁతల కపటాలెల్లా సమ్మతించు మననేల చలము సాధించనేల యిమ్ముల మాయిచ్చనుంటే యీసడించేనా (॥ఆడ॥) కాఁగిలించుకుండుమాకాఁక లోనెముంచుకొని ఆఁగి పెదవి దడిపె ఆసలెల్లాను వీఁగనేల యిఁకను శ్రీవెంకటేశ కూడితివి పాఁగి యిట్టె నెలకొంటె బాసలాడిగేనా English(||pallavi||) āḍanīḍa nuṁḍam̐gā ninnanem̐ gāga kūḍi yiṭṭĕ vuṁḍidenu kobagiṁchenā (||āḍa||) nāmŏgamu sūḍumā nagidenĕ kānavachchī nī manasulonanunna nijamum̐ gallā yemadagamulu nela yiṁtesi ānalela nāmaṁchamumīm̐da nuṁṭe namma ne nanenā (||āḍa||) mummārunāḍumāmāḍa mŏdalane tĕlisĕnu kammina nīsem̐tala kabaḍālĕllā sammadiṁchu mananela salamu sādhiṁchanela yimmula māyichchanuṁṭe yīsaḍiṁchenā (||āḍa||) kām̐giliṁchuguṁḍumāgām̐ka lonĕmuṁchugŏni ām̐gi pĕdavi daḍibĕ āsalĕllānu vīm̐ganela yim̐kanu śhrīvĕṁkaḍeśha kūḍidivi pām̐gi yiṭṭĕ nĕlagŏṁṭĕ bāsalāḍigenā