Title (Indic)ఏలయ్య నీకు నాకు యిన్నేసి మాటలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏలయ్య నీకు నాకు యిన్నేసి మాటలు మేలుగలదంతయును మెరయుఁ గాక (॥ఏల॥) తగులు గలుగువారు తగవులెంచనున్నదా వెగటు లేమి సేసినా వెలయుఁగాక తెగువులు గలవారు దిక్కులు చూడ నున్నదా పగటులుగలవెల్లాఁ బచ్చి దేరుఁగాక (॥ఏల॥) మనసునమ్మినవారు మతకమెంచ నున్నదా చనవులన్నియు లోలో జరఁగుగాక వినయముగలవారు వెక్కసాలాడనున్నదా పెనఁగినంతవడి బీరములౌఁగాక (॥ఏల॥) కాఁగిలించుకొన్నవారు కడమ వెట్టనున్నదా చేఁగదేరఁ గూడితిమి చెల్లుఁగాక మూఁగుచు శ్రీ వేంకటేశ ముంచి మనవంటివారు తోఁగుఁ జమటలచేత దొమ్మియౌటఁగాక English(||pallavi||) elayya nīgu nāgu yinnesi māḍalu melugaladaṁtayunu mĕrayum̐ gāga (||ela||) tagulu galuguvāru tagavulĕṁchanunnadā vĕgaḍu lemi sesinā vĕlayum̐gāga tĕguvulu galavāru dikkulu sūḍa nunnadā pagaḍulugalavĕllām̐ bachchi derum̐gāga (||ela||) manasunamminavāru madagamĕṁcha nunnadā sanavulanniyu lolo jaram̐gugāga vinayamugalavāru vĕkkasālāḍanunnadā pĕnam̐ginaṁtavaḍi bīramulaum̐gāga (||ela||) kām̐giliṁchugŏnnavāru kaḍama vĕṭṭanunnadā sem̐gaderam̐ gūḍidimi sĕllum̐gāga mūm̐gusu śhrī veṁkaḍeśha muṁchi manavaṁṭivāru tom̐gum̐ jamaḍalaseda dŏmmiyauḍam̐gāga