Title (Indic)ఇంతటివాఁడవు నిన్ను యేమని పొగడేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇంతటివాఁడవు నిన్ను యేమని పొగడేము బంతినే నాపాలిటి భాగ్య ఫలమవు (॥ఇంత॥) తగవు దప్పక యేలే తగుమగవాని పొందు జగములో పతికి సంసారఫలము మొగమోటగలవాని ముచ్చట మాటల చవి తెగని తంగేటి జుంటి తేనెలలో తేట (॥ఇంత॥) సరవితో మనిపేటి సరసునికాఁగిలి నిరతిఁగాంతకు నిండు నిధానము నిరతపుజాణకానినెయ్యముతోడి నవ్వు సురతపు మర్మముల సొబగుల సోన (॥ఇంత॥) భావమెరిఁగి కూడేటి ప్రాణేశు కూటమి కైవశమై ఫలియించే కల్పతరువు యీవేళ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు చేవదేరిన వలపు చేతిలో మాణికము English(||pallavi||) iṁtaḍivām̐ḍavu ninnu yemani pŏgaḍemu baṁtine nābāliḍi bhāgya phalamavu (||iṁta||) tagavu dappaga yele tagumagavāni pŏṁdu jagamulo padigi saṁsāraphalamu mŏgamoḍagalavāni muchchaḍa māḍala savi tĕgani taṁgeḍi juṁṭi tenĕlalo teḍa (||iṁta||) saravido manibeḍi sarasunigām̐gili niradim̐gāṁtagu niṁḍu nidhānamu niradabujāṇagāninĕyyamudoḍi navvu suradabu marmamula sŏbagula sona (||iṁta||) bhāvamĕrim̐gi kūḍeḍi prāṇeśhu kūḍami kaivaśhamai phaliyiṁche kalbadaruvu yīveḽa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu sevaderina valabu sedilo māṇigamu