Title (Indic)ఎంత వేసరించవచ్చు యేపొద్దు నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత వేసరించవచ్చు యేపొద్దు నిన్ను పంతగాఁడ నీ చిత్తము భాగ్యము నాది (॥ఎంత॥) నిచ్చ నిచ్చ నీకు నవ్వు నేరుపఁగఁగలనా కచ్చు పెట్టి నీయంతనే కలితేఁగాక మెచ్చులుగా వలపులు మెడఁగట్టఁగలనా పచ్చిగా నాయందు నీకు బత్తి గలితేఁగాక (॥ఎంత॥) వొడివట్టి నిన్నొద్దఁ గూచుండఁ బెట్టఁగలనా బడి నీయంతనే నన్నుఁ బైకొంటేఁగాక గుడిగొనఁ జెమటలు కురియించఁగలనా కడలేని తమితోడ గరఁగితేఁగాక (॥ఎంత॥) మలసి బలిమిచేసి మరిగించఁగలనా చెలిమి నీయంతనే చేసితేఁగాక యెలమి శ్రీవేంకటేశ అలమేల్మంగనై నేను కలసితి నింకా నీవే కరుణింతు గాక English(||pallavi||) ĕṁta vesariṁchavachchu yebŏddu ninnu paṁtagām̐ḍa nī sittamu bhāgyamu nādi (||ĕṁta||) nichcha nichcha nīgu navvu nerubam̐gam̐galanā kachchu pĕṭṭi nīyaṁtane kalidem̐gāga mĕchchulugā valabulu mĕḍam̐gaṭṭam̐galanā pachchigā nāyaṁdu nīgu batti galidem̐gāga (||ĕṁta||) vŏḍivaṭṭi ninnŏddam̐ gūsuṁḍam̐ bĕṭṭam̐galanā baḍi nīyaṁtane nannum̐ baigŏṁṭem̐gāga guḍigŏnam̐ jĕmaḍalu kuriyiṁcham̐galanā kaḍaleni tamidoḍa garam̐gidem̐gāga (||ĕṁta||) malasi balimisesi marigiṁcham̐galanā sĕlimi nīyaṁtane sesidem̐gāga yĕlami śhrīveṁkaḍeśha alamelmaṁganai nenu kalasidi niṁkā nīve karuṇiṁtu gāga