Title (Indic)ఆన సుమ్మీ యిఁక నీకు నౌభళేశ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆన సుమ్మీ యిఁక నీకు నౌభళేశ మోనమేల మాఁటలాడు మొక్కే నౌభళేశ (॥ఆన॥) కాయమెల్లఁ జెమరించె కడుబడలితి విదె ఆయనాయఁ జాలుఁ గోప మౌభళేశ ఆయులు గరఁగించి అండకు వచ్చితి నేను మాయలేల నవ్వరాదా మాతో నౌభళేశ (॥ఆన॥) మెఱుఁగుమోవి వాడె మిక్కిలి బునకొట్టేవు అఱిముఱి మఱవేల యౌభళేశ గుఱిగా నీకొనగోరు గుబ్బలు సోఁకించితి నీ - మఱపులు చెల్లవిఁక మాను మౌభళేశ (॥ఆన॥) కలసితి మిద్దరము కన్నులనె కెంపుదేరె అలయకు మిఁక నీవు ఔభళేశ తలపోఁతలు మనకు తారుకాణ లివె వచ్చె బలిమి శ్రీవేంకటాద్రిపతి యౌభళేశ English(||pallavi||) āna summī yim̐ka nīgu naubhaḽeśha monamela mām̐ṭalāḍu mŏkke naubhaḽeśha (||āna||) kāyamĕllam̐ jĕmariṁchĕ kaḍubaḍalidi vidĕ āyanāyam̐ jālum̐ goba maubhaḽeśha āyulu garam̐giṁchi aṁḍagu vachchidi nenu māyalela navvarādā mādo naubhaḽeśha (||āna||) mĕṟum̐gumovi vāḍĕ mikkili bunagŏṭṭevu aṟimuṟi maṟavela yaubhaḽeśha guṟigā nīgŏnagoru gubbalu som̐kiṁchidi nī - maṟabulu sĕllavim̐ka mānu maubhaḽeśha (||āna||) kalasidi middaramu kannulanĕ kĕṁpuderĕ alayagu mim̐ka nīvu aubhaḽeśha talabom̐talu managu tārugāṇa livĕ vachchĕ balimi śhrīveṁkaḍādribadi yaubhaḽeśha