Title (Indic)ఆతని తలఁపు గంటి రంత చాలదా నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని తలఁపు గంటి రంత చాలదా నేఁడు చేతిచెక్కుతోడ వట్టి చింతనకేలమ్మా (॥ఆత॥) వీడెమిచ్చెఁ జాలదా వేగించితే నేమాయ తోడ మాటలాడకుంటే దోసమా యేమి వాడికాయ సందడినే వలపింత చాలదా సూడుఁబాడు పంతాలకుఁ జోటేదమ్మా (॥ఆత॥) ఆలనైతిఁ జాలదా అలిగుంటే నేమాయ కాలుదొక్కని దొక్కటే కడమింతే పో వేలు వెట్టి యిమ్మగొనె వెనకకే చాలదా నాలుక బెల్లాలు చూపె నాయము గాదమ్మా (॥ఆత॥) యింటికివచ్చెఁ జాలదా యేడ నున్న నేమాయ వొంటి మోవి పిప్పెయిన దొక్కటె కాక అంటి పట్టి శ్రీవేంకటాద్రిపతి నన్నుఁగాడె వెంటఁ బాయలే మిఁక వెలితి లేదమ్మా English(||pallavi||) ādani talam̐pu gaṁṭi raṁta sāladā nem̐ḍu sedisĕkkudoḍa vaṭṭi siṁtanagelammā (||āda||) vīḍĕmichchĕm̐ jāladā vegiṁchide nemāya toḍa māḍalāḍaguṁṭe dosamā yemi vāḍigāya saṁdaḍine valabiṁta sāladā sūḍum̐bāḍu paṁtālagum̐ joḍedammā (||āda||) ālanaidim̐ jāladā aliguṁṭe nemāya kāludŏkkani dŏkkaḍe kaḍamiṁte po velu vĕṭṭi yimmagŏnĕ vĕnagage sāladā nāluga bĕllālu sūbĕ nāyamu gādammā (||āda||) yiṁṭigivachchĕm̐ jāladā yeḍa nunna nemāya vŏṁṭi movi pippĕyina dŏkkaḍĕ kāga aṁṭi paṭṭi śhrīveṁkaḍādribadi nannum̐gāḍĕ vĕṁṭam̐ bāyale mim̐ka vĕlidi ledammā