Title (Indic)ఆడనుండి మోవి దిట్టే వంతేకాదా వలపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనుండి మోవి దిట్టే వంతేకాదా వలపు బూడిదెలో వసంతమా పోపో అంతేకాదా (॥ఆడ॥) నేనేడ నీవేడ నీతోడివారమా ఆనలువెట్టఁగవచ్చే వంతేకాదా దానికేమి గొరతా తతిలేదు మితిలేదు మానవుగా జగడాలు మరి యంతేకాదా (॥ఆడ॥) దాఁపనేల రాఁపులేల తడవవచ్చితిమా ఆపెచేతఁ బిలిపించే వంతేకాదా పై పై నింకానేల పంతనాలు మంతనాలు మాపుదాకా సరసము మరి యంతేకాదా (॥ఆడ॥) వన్నెలంత వాసులెంత వద్దనేటిదాననా అన్నిటా వేసాలు చల్లే వంతేకాదా వున్నతి శ్రీ వేంకటాద్రి నుండి వావిలిపాటిలో మన్నించితి రామచంద్ర మరి యంతేకాదా English(||pallavi||) āḍanuṁḍi movi diṭṭe vaṁtegādā valabu būḍidĕlo vasaṁtamā pobo aṁtegādā (||āḍa||) neneḍa nīveḍa nīdoḍivāramā ānaluvĕṭṭam̐gavachche vaṁtegādā dānigemi gŏradā tadiledu midiledu mānavugā jagaḍālu mari yaṁtegādā (||āḍa||) dām̐panela rām̐pulela taḍavavachchidimā ābĕsedam̐ bilibiṁche vaṁtegādā pai pai niṁkānela paṁtanālu maṁtanālu mābudāgā sarasamu mari yaṁtegādā (||āḍa||) vannĕlaṁta vāsulĕṁta vaddaneḍidānanā anniḍā vesālu salle vaṁtegādā vunnadi śhrī veṁkaḍādri nuṁḍi vāvilibāḍilo manniṁchidi rāmasaṁdra mari yaṁtegādā