Title (Indic)ఆకె యెటువంటిది నా కానతీవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకె యెటువంటిది నా కానతీవయ్యా చేకొని యిద్దరిఁ బెండ్లిసేసే నిన్నిపుడు (॥ఆకె॥) పడఁతిచన్నుల మీఁద పాదాలద్దుకొంటాను అడరినకాఁక చల్లార్చుకొనేవు యెడసి యెవ్వతో నిన్ను యేఁపులఁ బెట్టఁగఁబోలు కడునీతమక మెల్లా కానవచ్చె నాకును (॥ఆకె॥) జలజాక్షిపయ్యద సారెఁ గప్పుకొంటాను వొలుకుఁజెమట తడియెత్తుకొనేవు వలపించెవ్వతో వుమ్మగిల నిన్నుఁ జేయఁబోలు వెలి నీవిరహమెల్లా వెల్లవిరులాయను (॥ఆకె॥) జవ్వని మోవితేనెలు చవిగొని తొడిఁబడ అవ్వలిరతులదప్పి యాఁపుకొనేవు ఇవ్వల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి దవ్వులాకెపొందు లిందెతారుకాణ వచ్చెను English(||pallavi||) āgĕ yĕḍuvaṁṭidi nā kānadīvayyā segŏni yiddarim̐ bĕṁḍlisese ninnibuḍu (||āgĕ||) paḍam̐tisannula mīm̐da pādāladdugŏṁṭānu aḍarinagām̐ka sallārsugŏnevu yĕḍasi yĕvvado ninnu yem̐pulam̐ bĕṭṭam̐gam̐bolu kaḍunīdamaga mĕllā kānavachchĕ nāgunu (||āgĕ||) jalajākṣhibayyada sārĕm̐ gappugŏṁṭānu vŏlugum̐jĕmaḍa taḍiyĕttugŏnevu valabiṁchĕvvado vummagila ninnum̐ jeyam̐bolu vĕli nīvirahamĕllā vĕllavirulāyanu (||āgĕ||) javvani movidenĕlu savigŏni tŏḍim̐baḍa avvaliraduladappi yām̐pugŏnevu ivvala śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi davvulāgĕbŏṁdu liṁdĕdārugāṇa vachchĕnu