Title (Indic)ఏమి నేరుపే నీది యింటికిఁ బిలిచే వతని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏమి నేరుపే నీది యింటికిఁ బిలిచే వతని కామించినవారు వేళగాచి యుండఁగాను (॥ఏమి॥) వొక్కెతెవే నీవతని నొడిఁ బెట్టుకొనేవటే పిక్కటిల్లి యిల్లునిండాఁ బెండ్లాలుండఁగా అక్కరఁజేపట్టేవేమే ఆతనిముంజేతివే పెక్కుకంకణదారాలు పెట్టెఁడుండఁగాను (॥ఏమి॥) నెమ్మి నాతనిపైఁ బత్తి నీపాలికే వచ్చెనటే యిమ్ములఁ గాంతలు మేడలెక్కిచూడఁగా కమ్మినేఁడు నీచుట్టరికమే చెప్పేనదేమే వుమ్మడి వావులవారు వూరెల్లా నుండఁగాను (॥ఏమి॥) కలయ నతఁడు నీకే కాణాచియటవే చెలు లెందరైనా వచ్చిసేవసేయఁగా యెలమి శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్నుఁ గూడె వలపులెల్లా నీతనివాకిట నుండఁగాను English(||pallavi||) emi nerube nīdi yiṁṭigim̐ bilise vadani kāmiṁchinavāru veḽagāsi yuṁḍam̐gānu (||emi||) vŏkkĕdĕve nīvadani nŏḍim̐ bĕṭṭugŏnevaḍe pikkaḍilli yilluniṁḍām̐ bĕṁḍlāluṁḍam̐gā akkaram̐jebaṭṭeveme ādanimuṁjedive pĕkkugaṁkaṇadārālu pĕṭṭĕm̐ḍuṁḍam̐gānu (||emi||) nĕmmi nādanibaim̐ batti nībālige vachchĕnaḍe yimmulam̐ gāṁtalu meḍalĕkkisūḍam̐gā kamminem̐ḍu nīsuṭṭarigame sĕppenademe vummaḍi vāvulavāru vūrĕllā nuṁḍam̐gānu (||emi||) kalaya nadam̐ḍu nīge kāṇāsiyaḍave sĕlu lĕṁdarainā vachchisevaseyam̐gā yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannum̐ gūḍĕ valabulĕllā nīdanivāgiḍa nuṁḍam̐gānu