Title (Indic)ఆతఁడు బత్తిసేయఁగా నన్నీ నమరె నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు బత్తిసేయఁగా నన్నీ నమరె నీకు కాతరాన విడెమిచ్చి కాఁగిలించగదవే (॥ఆత॥) సంతోసానఁ బెనఁగఁగా జగడము లేదుగాక పంతములాడుకొంటే పచ్చిదేరదా వింతలేక వుండఁగానే వేడుకలు వుటెఁగాక వంతులు వాసు లెంచితే వలపు గలుగునా (॥ఆత॥) ననుపు గలుగఁగానే నవ్వు లితవాయఁగాక చెనకితే చలములు చిమ్మిఁరేగవా వినయము చూపఁగానే వెలెసెఁగాక పొందులు మనసు రాకుండితే మర్మములు గరఁగునా (॥ఆత॥) యిట్టె సేసలు చల్లఁగా నియ్యకోళ్లాయఁగాక వట్టిసిగ్గున నుండితే వాడికలౌనా నెట్టన శ్రీవేంకటాద్రివిలయుఁడు నిన్నుఁ గూడె చుట్టరికమెంతైనా సొంపులే పుట్టించవా English(||pallavi||) ādam̐ḍu battiseyam̐gā nannī namarĕ nīgu kādarāna viḍĕmichchi kām̐giliṁchagadave (||āda||) saṁtosānam̐ bĕnam̐gam̐gā jagaḍamu ledugāga paṁtamulāḍugŏṁṭe pachchideradā viṁtalega vuṁḍam̐gāne veḍugalu vuḍĕm̐gāga vaṁtulu vāsu lĕṁchide valabu galugunā (||āda||) nanubu galugam̐gāne navvu lidavāyam̐gāga sĕnagide salamulu simmim̐regavā vinayamu sūbam̐gāne vĕlĕsĕm̐gāga pŏṁdulu manasu rāguṁḍide marmamulu garam̐gunā (||āda||) yiṭṭĕ sesalu sallam̐gā niyyagoḽlāyam̐gāga vaṭṭisigguna nuṁḍide vāḍigalaunā nĕṭṭana śhrīveṁkaḍādrivilayum̐ḍu ninnum̐ gūḍĕ suṭṭarigamĕṁtainā sŏṁpule puṭṭiṁchavā