Title (Indic)ఏ పొద్దూఁ గొలువు సేసీ నింతులతోను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ పొద్దూఁ గొలువు సేసీ నింతులతోను యేపున మేడలోనికి యిట్టె రమ్మనవే (॥॥) వింతవారిమాటలైతే వినవేడుకలై యుండు సంతవారి జూడనై తే జరగు మతి చింతలపులుసులకు చెలరేగి నోరూరు యెంతలేదు రమణుని నీడకు రమ్మనవే (॥॥) నవ్వేవారి వద్దనుంటే ననుపుల బొద్దు లెక్కు దవ్వుల సన్నలకైతేఁ దమివుట్టును పువ్వులవాసనగాలి పొలసితే నాసవుట్టు వువ్విళ్లూర నెంతలేదు వొద్దికిరమ్మనవే (॥॥) మేనవారివావులకు మేలములు పెచ్చురేఁగు కానికనిమ్మపండ్లకుఁ గడఁగుఁజేయి యే నలమేలుమంగను యిట్టె తా శ్రీవేంకటేశుఁ- డానుక నన్నేలె నిట్టే అప్పటి రమ్మనవే English(||pallavi||) e pŏddūm̐ gŏluvu sesī niṁtuladonu yebuna meḍalonigi yiṭṭĕ rammanave (||||) viṁtavārimāḍalaide vinaveḍugalai yuṁḍu saṁtavāri jūḍanai te jaragu madi siṁtalabulusulagu sĕlaregi norūru yĕṁtaledu ramaṇuni nīḍagu rammanave (||||) navvevāri vaddanuṁṭe nanubula bŏddu lĕkku davvula sannalagaidem̐ damivuṭṭunu puvvulavāsanagāli pŏlaside nāsavuṭṭu vuvviḽlūra nĕṁtaledu vŏddigirammanave (||||) menavārivāvulagu melamulu pĕchchurem̐gu kāniganimmabaṁḍlagum̐ gaḍam̐gum̐jeyi ye nalamelumaṁganu yiṭṭĕ tā śhrīveṁkaḍeśhum̐- ḍānuga nannelĕ niṭṭe appaḍi rammanave