Title (Indic)ఆనతీవయ్యా యింకా ననుమానా లేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్యా యింకా ననుమానా లేఁటికి యే నెపాలూ లేకున్న నిటువలెఁ జేసునా (॥ఆన॥) వసివాఁడు జూపులు వంచి నిన్నుఁ గొసరుచు నసురుసురయ్యీఁ జెలి అది యేఁటికి యెఁసగి యిందాఁకా మీరు యేకతాననె వుంటిరి కనుగాటు రతులలోఁ గడమ యేమాయనో (॥ఆన॥) తలవంచుకొని నీతో తమకపు మాటలాడి సొలయుచు నింతి మొక్కి పొలగిలీని చలివాయ నిందాఁకా సరసము లాడితిరి చలముతో మతికేమి సమ్మతిగాదాయనో (॥ఆన॥) సన్నలనే జంకించి జవ్వనపు మదమున చన్ను మొన లటుచూపి సాదించీని యిన్నిటా శ్రీవెంకటేశ యెనసితి రిద్దరును పన్నిన మీపంతముల బలిమి యెంతాయనో English(||pallavi||) ānadīvayyā yiṁkā nanumānā lem̐ṭigi ye nĕbālū legunna niḍuvalĕm̐ jesunā (||āna||) vasivām̐ḍu jūbulu vaṁchi ninnum̐ gŏsarusu nasurusurayyīm̐ jĕli adi yem̐ṭigi yĕm̐sagi yiṁdām̐kā mīru yegadānanĕ vuṁṭiri kanugāḍu radulalom̐ gaḍama yemāyano (||āna||) talavaṁchugŏni nīdo tamagabu māḍalāḍi sŏlayusu niṁti mŏkki pŏlagilīni salivāya niṁdām̐kā sarasamu lāḍidiri salamudo madigemi sammadigādāyano (||āna||) sannalane jaṁkiṁchi javvanabu madamuna sannu mŏna laḍusūbi sādiṁchīni yinniḍā śhrīvĕṁkaḍeśha yĕnasidi riddarunu pannina mībaṁtamula balimi yĕṁtāyano