Title (Indic)ఆనలీవయ్యా నాకు నన్నియు వినేఁగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనలీవయ్యా నాకు నన్నియు వినేఁగాని మోనముతో సిగ్గువడి మొక్కక వుందానను (॥ఆన॥) చెలులచే విన్నపము సేయింపించిన మాటలు తలఁగ కెప్పుడు నీచిత్తాన నున్నవా వలపురొమ్ము లబంటి వాసులు యీఁతలబంటి పలుకఁగ సిగ్గువడి భ్రమతో నుందానను (॥ఆన॥) కానుకగా నీకంపినకందువై నగురుతులు తానకమై బండారాన దాఁచివున్నవా నానెను జవ్వనమెల్లా నవ్వులు మొలకలెత్తె పూని యంట సిగ్గువడి పొంచుకవుందానను (॥ఆన॥) ఇంపులసన్నలనే యెచ్చరించినచేఁతలు ముంపులై యిప్పుడు నీమోవి నున్నవా నింపుల శ్రీవేంకటేశ నీమోవినే మరుముద్ర గుంపు నిన్నుఁగూడి సిగ్గు గుఱుతై వుందానను English(||pallavi||) ānalīvayyā nāgu nanniyu vinem̐gāni monamudo sigguvaḍi mŏkkaga vuṁdānanu (||āna||) sĕlulase vinnabamu seyiṁpiṁchina māḍalu talam̐ga kĕppuḍu nīsittāna nunnavā valaburŏmmu labaṁṭi vāsulu yīm̐talabaṁṭi palugam̐ga sigguvaḍi bhramado nuṁdānanu (||āna||) kānugagā nīgaṁpinagaṁduvai nagurudulu tānagamai baṁḍārāna dām̐sivunnavā nānĕnu javvanamĕllā navvulu mŏlagalĕttĕ pūni yaṁṭa sigguvaḍi pŏṁchugavuṁdānanu (||āna||) iṁpulasannalane yĕchchariṁchinasem̐talu muṁpulai yippuḍu nīmovi nunnavā niṁpula śhrīveṁkaḍeśha nīmovine marumudra guṁpu ninnum̐gūḍi siggu guṟudai vuṁdānanu