Title (Indic)జవ్వనము నీమేన జడిగొనివున్నది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) జవ్వనము నీమేన జడిగొనివున్నది చివ్వనఁ జేయి మీఁదుగాఁ జెనకి పైకొనవే (॥జవ్వ॥) సిగ్గులెంత పెంచినాను చిత్తము గరఁగీనా అగ్గలము గొసరితే నాస దీరీనా దగ్గరి కొలిచితేనే తనివివుట్టీనా కగ్గులేనివేడుకతోఁ గాఁగిలించుకొనవే (॥జవ్వ॥) కన్నులఁ జూచితేను కలసినట్టయ్యీనా సన్నలఁ బొద్దువుచ్చితే సంతోసా లవునా మిన్నక నవ్వితేనే మేనుమేను సొఁకీనా చన్నుల నొరపి మోవి చవిచూడఁగదవే (॥జవ్వ॥) సంగడిఁ గూచుండితేను జంటలయ్యీనా పొందు ముంగిటిమాఁట లెన్నైనా మోచీనా వావి యింగిత మెఱిఁగి కూడె నిదె శ్రీవేంకటేశుఁడు అంగవించి యేపొద్దూఁ బాయకవుండఁగదవే English(||pallavi||) javvanamu nīmena jaḍigŏnivunnadi sivvanam̐ jeyi mīm̐dugām̐ jĕnagi paigŏnave (||javva||) siggulĕṁta pĕṁchinānu sittamu garam̐gīnā aggalamu gŏsaride nāsa dīrīnā daggari kŏlisidene tanivivuṭṭīnā kagguleniveḍugadom̐ gām̐giliṁchugŏnave (||javva||) kannulam̐ jūsidenu kalasinaṭṭayyīnā sannalam̐ bŏdduvuchchide saṁtosā lavunā minnaga navvidene menumenu sŏm̐kīnā sannula nŏrabi movi savisūḍam̐gadave (||javva||) saṁgaḍim̐ gūsuṁḍidenu jaṁṭalayyīnā pŏṁdu muṁgiḍimām̐ṭa lĕnnainā mosīnā vāvi yiṁgida mĕṟim̐gi kūḍĕ nidĕ śhrīveṁkaḍeśhum̐ḍu aṁgaviṁchi yebŏddūm̐ bāyagavuṁḍam̐gadave