Title (Indic)ఆనతీవయ్యా మాకు నందుకు నేమాయను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్యా మాకు నందుకు నేమాయను పూని తగవుదిద్దేము పొలఁతుల మిపుడు (॥ఆన॥) సొలసిసొలసి చూచి చొప్పలెత్తి నీకుఁ జూపి చెలి నీకు విన్నపాలుసేసీ నిదె తలఁపులో బెట్టుకొని దాఁచిదాఁచి నవ్వేవు కలదా నీవోళ్లఁ గొంత కపట మేమైనను (॥ఆన॥) తారుకాణలెల్లఁ జేసి దయవుట్ట నీకు మొక్కి కూరిములు చల్లి చల్లి కొసరీ నిన్ను వూరకె తలవంచేవు వొడ్డించుకొనే వప్పటి నేరము లేమైనాను నీవల్లఁ గలవా (॥ఆన॥) నిన్నే వొడఁబరచి నీకన్నిబుద్దులూఁ జెప్పి కన్నె యలమేలుమంగ కాఁగిలించీని యిన్నిటా శ్రీవేంకటేశ యియ్యకొంటివి నీవును వున్నవా నీవల్లఁ గొన్ని వుదుటుఁచేతలు English(||pallavi||) ānadīvayyā māgu naṁdugu nemāyanu pūni tagavudiddemu pŏlam̐tula mibuḍu (||āna||) sŏlasisŏlasi sūsi sŏppalĕtti nīgum̐ jūbi sĕli nīgu vinnabālusesī nidĕ talam̐pulo bĕṭṭugŏni dām̐sidām̐si navvevu kaladā nīvoḽlam̐ gŏṁta kabaḍa memainanu (||āna||) tārugāṇalĕllam̐ jesi dayavuṭṭa nīgu mŏkki kūrimulu salli salli kŏsarī ninnu vūragĕ talavaṁchevu vŏḍḍiṁchugŏne vappaḍi neramu lemainānu nīvallam̐ galavā (||āna||) ninne vŏḍam̐barasi nīgannibuddulūm̐ jĕppi kannĕ yalamelumaṁga kām̐giliṁchīni yinniḍā śhrīveṁkaḍeśha yiyyagŏṁṭivi nīvunu vunnavā nīvallam̐ gŏnni vuduḍum̐sedalu