Title (Indic)ఎంతలేదు నీ పగటు యేమిచెప్పేదే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంతలేదు నీ పగటు యేమిచెప్పేదే మంతనాన నా కితఁడు మాట ఇచ్చినాఁడు (॥ఎంత॥) కందవ లేమిచూపేవే కన్నుసన్నలను మందు లెంతనూరేవే మంచిమాటల యెందరైనా సవతులు యిరుమేలా నుండఁగాను అంది నీవే యీతనికి నాలవైతివా (॥ఎంత॥) ఆసలేల పుట్టించేవే అట్టె ముందటఁ బొలసి వేసా లేమి సేసేవే వెడనవ్వుల సేసలువెట్టినవారు చేరి కాచుకుండఁగాను బేసబెల్లినిన్ను నేఁడు పెండ్లాడీనా (॥ఎంత॥) వావు లేమి దెలిపేవే వాడికచేఁతలను మోవేల కదలించేవే మురిపముల యీవల నలమేల్మంగ యేను గూడివుండఁగాను శ్రీవేంకటేశుఁడు నీకుఁ జేతికిలోనయ్యీనా English(||pallavi||) ĕṁtaledu nī pagaḍu yemisĕppede maṁtanāna nā kidam̐ḍu māḍa ichchinām̐ḍu (||ĕṁta||) kaṁdava lemisūbeve kannusannalanu maṁdu lĕṁtanūreve maṁchimāḍala yĕṁdarainā savadulu yirumelā nuṁḍam̐gānu aṁdi nīve yīdanigi nālavaidivā (||ĕṁta||) āsalela puṭṭiṁcheve aṭṭĕ muṁdaḍam̐ bŏlasi vesā lemi seseve vĕḍanavvula sesaluvĕṭṭinavāru seri kāsuguṁḍam̐gānu besabĕllininnu nem̐ḍu pĕṁḍlāḍīnā (||ĕṁta||) vāvu lemi dĕlibeve vāḍigasem̐talanu movela kadaliṁcheve muribamula yīvala nalamelmaṁga yenu gūḍivuṁḍam̐gānu śhrīveṁkaḍeśhum̐ḍu nīgum̐ jedigilonayyīnā