Title (Indic)ఇది దా నా వలపంటా యీడుచూపీనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇది దా నా వలపంటా యీడుచూపీనే పదరే నా మతికి దాఁ బై కొసరా (॥ఇది॥) నిక్కి నే విరహమున నిట్టూర్పు నించఁగాను పుక్కటఁ దా నేమిసేశో బుసకొట్టీనే చెక్కుచేతిచింతతో నే చెమరించఁగాఁ దాను చిక్కినసురతముల చెమటఁ దోఁగీనే (॥ఇది॥) తనపై మోహమున నే దగఁ బులకించఁగాను పొనిగి తానేమిటివో పులకించీనే నినుపుఁగోరికల నే నివ్వెరగుపడఁగాను వెనకటి చేఁతలకు వెరగందీనే (॥ఇది॥) కమ్మరఁగమ్మర నే కాఁగిలించఁగా తాను కమ్మి యెవ్వతోఁ దలఁచి కాఁగిలించీనే అమ్మరో శ్రీవేంకటేశుఁ డట్టివాఁడా కాఁడు నేఁడు నమ్మించి నన్నుఁ గూడి నవ్వు నవ్వీనే English(||pallavi||) idi dā nā valabaṁṭā yīḍusūbīne padare nā madigi dām̐ bai kŏsarā (||idi||) nikki ne virahamuna niṭṭūrbu niṁcham̐gānu pukkaḍam̐ dā nemiseśho busagŏṭṭīne sĕkkusedisiṁtado ne sĕmariṁcham̐gām̐ dānu sikkinasuradamula sĕmaḍam̐ dom̐gīne (||idi||) tanabai mohamuna ne dagam̐ bulagiṁcham̐gānu pŏnigi tānemiḍivo pulagiṁchīne ninubum̐gorigala ne nivvĕragubaḍam̐gānu vĕnagaḍi sem̐talagu vĕragaṁdīne (||idi||) kammaram̐gammara ne kām̐giliṁcham̐gā tānu kammi yĕvvadom̐ dalam̐si kām̐giliṁchīne ammaro śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭivām̐ḍā kām̐ḍu nem̐ḍu nammiṁchi nannum̐ gūḍi navvu navvīne