Title (Indic)ఆన సుమ్మీ నీకును ప్రహ్లాదవరదా । నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆన సుమ్మీ నీకును ప్రహ్లాదవరదా । నిన్ను- నానితిఁ గుచముల ప్రహ్లాదవరదా (॥ఆన॥) అలుక మానుమీ ప్రహ్లాదవరదా నిన్ను- నలమితి నిప్పుడే ప్రహ్లాదవరదా అలసితి రతుల ప్రహ్లాదవరదా నీకు- నలవాటే ఇన్నియుఁ బ్రహ్లాదవరదా (॥ఆన॥) అంగపుఁ జెమటల ప్రహ్లాదవరద నీకు- నంగడి మొక్కు మొక్కేఁ బ్రహ్లాదవరదా అంగదెల్లాఁ బాసెను ప్రహ్లాదవరదా మోవి- నంగజముద్ర లంటెఁ బ్రహ్లాదవరదా (॥ఆన॥) ఆరితేరెఁ బనులు ప్రహ్లాదవరదా యింక- నారీతి మన్నించుమీ ప్రహ్లా దవరదా యీరీతి శ్రీవేంకటాద్రి నిందునందుఁ గూడఁగాను హారములు పెనఁగెఁ బ్రహ్లాదవరదా English(||pallavi||) āna summī nīgunu prahlādavaradā | ninnu- nānidim̐ gusamula prahlādavaradā (||āna||) aluga mānumī prahlādavaradā ninnu- nalamidi nippuḍe prahlādavaradā alasidi radula prahlādavaradā nīgu- nalavāḍe inniyum̐ brahlādavaradā (||āna||) aṁgabum̐ jĕmaḍala prahlādavarada nīgu- naṁgaḍi mŏkku mŏkkem̐ brahlādavaradā aṁgadĕllām̐ bāsĕnu prahlādavaradā movi- naṁgajamudra laṁṭĕm̐ brahlādavaradā (||āna||) āriderĕm̐ banulu prahlādavaradā yiṁka- nārīdi manniṁchumī prahlā davaradā yīrīdi śhrīveṁkaḍādri niṁdunaṁdum̐ gūḍam̐gānu hāramulu pĕnam̐gĕm̐ brahlādavaradā