Title (Indic)వెల్లవిరాయఁ బనులు విట్ఠలేశ్వరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వెల్లవిరాయఁ బనులు విట్ఠలేశ్వరా చల్లజంపు సేఁతల సటకారివాఁడవు (॥॥) ననుఁజూచి కొలువులో నవ్వినదే చాలదా వనితల యెడల గర్వపు వాఁడవు చెనకి యప్పటి నన్నుఁ జేఁత నంటవలెనా పొనుగనివలపులపొత్తులవాఁడవు (॥॥) మచ్చికల నాతోడ మాటాడుచే చాలదా కుచ్చితపు బహు పరాకులవాఁడవు విచ్చనవిడి నిప్పుడే విడెమియ్యవలెనా మచ్చు వేసితీ సేవెడమాయదారివాఁడవు (॥॥) సంగడి నాపై సేస చల్లుటే చాలదా సంగ తెరిఁగి నెన రజాణకాఁడవు చెంగట నన్నేలితివి శ్రీనేంకటేశుఁడవై యెంగిలి సేయవలెనా యిచ్చకపువాఁడవు English(||pallavi||) vĕllavirāyam̐ banulu viṭṭhaleśhvarā sallajaṁpu sem̐tala saḍagārivām̐ḍavu (||||) nanum̐jūsi kŏluvulo navvinade sāladā vanidala yĕḍala garvabu vām̐ḍavu sĕnagi yappaḍi nannum̐ jem̐ta naṁṭavalĕnā pŏnuganivalabulabŏttulavām̐ḍavu (||||) machchigala nādoḍa māḍāḍuse sāladā kuchchidabu bahu parāgulavām̐ḍavu vichchanaviḍi nippuḍe viḍĕmiyyavalĕnā machchu vesidī sevĕḍamāyadārivām̐ḍavu (||||) saṁgaḍi nābai sesa salluḍe sāladā saṁga tĕrim̐gi nĕna rajāṇagām̐ḍavu sĕṁgaḍa nannelidivi śhrīneṁkaḍeśhum̐ḍavai yĕṁgili seyavalĕnā yichchagabuvām̐ḍavu