Title (Indic)నా వల్లఁ(యందుఁ?) దప్పు లేదు నేనా చాటిచెప్పితిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నా వల్లఁ(యందుఁ?) దప్పు లేదు నేనా చాటిచెప్పితిని నాయము మీరు చెప్పరే నాకూ నాతనికీ (॥॥) పాయపువాఁడు గనక పంతములే యాడీని చాయల నేనూ నిట్టే జవ్వనిఁగదే చేయి మీఁదాయనంటాను చెనకఁ గవచ్చీని ఆయములు నేనూఁ గొంత అట్టె సొఁకింతుఁ గదే (॥॥) వేడుకకాఁడు గనక వేసీఁ బూవులచెండున వాడిక నాతమి తనవంటిదే కదే వీడెమిచ్చితింటాను వెసఁ గొంగువట్టీని తోడనే నేనూఁ గాలుదొక్కి పైకొందుఁగదే (॥॥) బలిమికాఁడు గనక పట్టీ నాచనుఁగన నలి నేనూఁ గాఁగిటఁ బెనఁగుదుఁగదే యెలమి శ్రీ వేంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె కెలసి తనమోవి యెంగిలి సేతుఁ గదవే English(||pallavi||) nā vallam̐(yaṁdum̐?) dappu ledu nenā sāḍisĕppidini nāyamu mīru sĕppare nāgū nādanigī (||||) pāyabuvām̐ḍu ganaga paṁtamule yāḍīni sāyala nenū niṭṭe javvanim̐gade seyi mīm̐dāyanaṁṭānu sĕnagam̐ gavachchīni āyamulu nenūm̐ gŏṁta aṭṭĕ sŏm̐kiṁtum̐ gade (||||) veḍugagām̐ḍu ganaga vesīm̐ būvulasĕṁḍuna vāḍiga nādami tanavaṁṭide kade vīḍĕmichchidiṁṭānu vĕsam̐ gŏṁguvaṭṭīni toḍane nenūm̐ gāludŏkki paigŏṁdum̐gade (||||) balimigām̐ḍu ganaga paṭṭī nāsanum̐gana nali nenūm̐ gām̐giḍam̐ bĕnam̐gudum̐gade yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ kĕlasi tanamovi yĕṁgili sedum̐ gadave