Title (Indic)ఆఁటది గూళయైతే నం దేమున్నది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటది గూళయైతే నం దేమున్నది చీటికి మాటికి నింత సిగ్గులు విడుతురా (॥॥) సవతి నంటా నాతో సణఁగులు చల్లి చల్లి తివురుచు వచ్చి యేల తెర దీశేవే పవళించి వున్నవాఁడు పానుపుపై రమణుఁడు వివర మెఱఁగ కేల వేగిరించేవే (॥॥) వరుస నా దెంటా నీవు వట్టి రొద లెల్లాఁజేసి పరగ నేల మంచముపైఁ గూచుండేవే నిరతిరతి నలసి నిద్దిరింపుచున్నవాఁడు వెర వెఱఁగక యేల వేగిరించేవే (॥॥) అంతలో నా యీడుదాన నంటా లోను చొచ్చి వచ్చి కాంతుని నీ వేఁటికిఁ గౌఁగిలించేవే చెంత మేలుకొని నన్ను శ్రీవెంకటేశుఁడు గూడె వింతదానవై యేల వేగిరించేవే English(||pallavi||) ām̐ṭadi gūḽayaide naṁ demunnadi sīḍigi māḍigi niṁta siggulu viḍudurā (||||) savadi naṁṭā nādo saṇam̐gulu salli salli tivurusu vachchi yela tĕra dīśheve pavaḽiṁchi vunnavām̐ḍu pānububai ramaṇum̐ḍu vivara mĕṟam̐ga kela vegiriṁcheve (||||) varusa nā dĕṁṭā nīvu vaṭṭi rŏda lĕllām̐jesi paraga nela maṁchamubaim̐ gūsuṁḍeve niradiradi nalasi niddiriṁpusunnavām̐ḍu vĕra vĕṟam̐gaga yela vegiriṁcheve (||||) aṁtalo nā yīḍudāna naṁṭā lonu sŏchchi vachchi kāṁtuni nī vem̐ṭigim̐ gaum̐giliṁcheve sĕṁta melugŏni nannu śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕ viṁtadānavai yela vegiriṁcheve