Title (Indic)ఆపెకు నీకునే కాక అండవారి కేమి వోదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపెకు నీకునే కాక అండవారి కేమి వోదు కైపు సేసి మిమ్ము నేము కా దనేటివారమా (॥ఆపె॥) పువ్వుబంతిఁ గొని చెలి పూఁచి నిన్ను వేయఁగాను యెవ్వరి సాకిరి వెట్టి యేమి సేసేవు జవ్వనికి నీవిచ్చినచన వింతెకాక అది చివ్వన నూరివా రింత సేయ వచ్చేరా (॥ఆపె॥) చిమ్మి రేఁగి సతి నిన్నుఁజిలుక చేఁ దిట్టంచఁగ యిమ్ముల మా మొకములు నీ వేమి చూచేవు సమ్మతించినమీలోనిసరసము లింతే కాక కమ్మర మానుప మాకు కారణము గలదా (॥ఆపె॥) చేతు లెత్తి మొక్కి యింతి చెక్కిట జీర దియ్యఁగ యీతల మాకేల చూపే వేడసుద్దులు యేతుల శ్రీవేంకటేశ యెనసె నాపె కాఁగిట ఘాతగఁ గడవారు నిన్నౌఁగాదానఁ గలరా English(||pallavi||) ābĕgu nīgune kāga aṁḍavāri kemi vodu kaibu sesi mimmu nemu kā daneḍivāramā (||ābĕ||) puvvubaṁtim̐ gŏni sĕli pūm̐si ninnu veyam̐gānu yĕvvari sāgiri vĕṭṭi yemi sesevu javvanigi nīvichchinasana viṁtĕgāga adi sivvana nūrivā riṁta seya vachcherā (||ābĕ||) simmi rem̐gi sadi ninnum̐jiluga sem̐ diṭṭaṁcham̐ga yimmula mā mŏgamulu nī vemi sūsevu sammadiṁchinamīlonisarasamu liṁte kāga kammara mānuba māgu kāraṇamu galadā (||ābĕ||) sedu lĕtti mŏkki yiṁti sĕkkiḍa jīra diyyam̐ga yīdala māgela sūbe veḍasuddulu yedula śhrīveṁkaḍeśha yĕnasĕ nābĕ kām̐giḍa ghādagam̐ gaḍavāru ninnaum̐gādānam̐ galarā