Title (Indic)బాపు బాపు నీమేలు పక్కన నన్నంటుకొనె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు నీమేలు పక్కన నన్నంటుకొనె కైపగు పుణుఁగు పువ్వు గట్టినట్టే ఆయను (॥బాపు॥) పనిలేని పనికైనఁ బదరి కోపగింతు వెనకనే నీవు నన్ను వేడుకొందువు తలవోని నీమంచితనమె నావీరిడి- తనమెల్లఁ బాపి లోలో తమి నాకు రేఁచెను (॥బాపు॥) యెప్పుడు నే నాడేవి యీసడపు పలుకులే కప్పురపు నవ్వు నీవే కలపుదువు యిప్పటి నానేరమికే యింతేసి నీ నేరుపులు చొప్పు మాపి నిన్ను నన్ను చుట్టాలఁగా జేసెను (॥బాపు॥) చీటికి మాటికి నీతో సిగ్గులు నేఁ బచరింతు కూటపుఁ గాఁగిట నీవే కూడుదువు యీటున శ్రీవేంకటేశ యిప్పటి నీరతులే వోటమి దీర నన్ను నీ పుర మెక్కఁజేసెను English(||pallavi||) bābu bābu nīmelu pakkana nannaṁṭugŏnĕ kaibagu puṇum̐gu puvvu gaṭṭinaṭṭe āyanu (||bābu||) panileni panigainam̐ badari kobagiṁtu vĕnagane nīvu nannu veḍugŏṁduvu talavoni nīmaṁchidanamĕ nāvīriḍi- tanamĕllam̐ bābi lolo tami nāgu rem̐sĕnu (||bābu||) yĕppuḍu ne nāḍevi yīsaḍabu palugule kappurabu navvu nīve kalabuduvu yippaḍi nāneramige yiṁtesi nī nerubulu sŏppu mābi ninnu nannu suṭṭālam̐gā jesĕnu (||bābu||) sīḍigi māḍigi nīdo siggulu nem̐ basariṁtu kūḍabum̐ gām̐giḍa nīve kūḍuduvu yīḍuna śhrīveṁkaḍeśha yippaḍi nīradule voḍami dīra nannu nī pura mĕkkam̐jesĕnu