Title (Indic)ఎచ్చరించెదననిన యీ జగంబనఁగాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎచ్చరించెదననిన యీ జగంబనఁగాను సచ్చరిత్రుఁడ నీకు సరకా వోరి (॥ఎచ్చ॥) రుచుల నారాయణ పరో జ్యోతి యని పచరించి నిను శ్రుతులు పలుకఁగాను వచియింపరాని యిటువంటి నీ యెదుట నా- కుచకుంభములకాంతి కొలుపునా వోరి (॥ఎచ్చ॥) రమణ నారాయణ పరబహ్మమని ప్రమదమున నిను శ్రుతులు పలుకఁగాను తమకమున నను నీవు తగిలితివి యీసుఖము నిమిషమాసుఖము గానేర్చువా వోరి (॥ఎచ్చ॥) అరయ నారాయణ పరాత్పరంబని నిన్ను సరసవిద్యలు శ్రుతులు చాటఁగాను సిరుల ననుఁగూడితివి శ్రీ వేంకటేశ నీఁ కరుణకిటు నేనోర్వఁగలనా వోరి English(||pallavi||) ĕchchariṁchĕdananina yī jagaṁbanam̐gānu sachcharitrum̐ḍa nīgu saragā vori (||ĕchcha||) rusula nārāyaṇa paro jyodi yani pasariṁchi ninu śhrudulu palugam̐gānu vasiyiṁparāni yiḍuvaṁṭi nī yĕduḍa nā- kusaguṁbhamulagāṁti kŏlubunā vori (||ĕchcha||) ramaṇa nārāyaṇa parabahmamani pramadamuna ninu śhrudulu palugam̐gānu tamagamuna nanu nīvu tagilidivi yīsukhamu nimiṣhamāsukhamu gānersuvā vori (||ĕchcha||) araya nārāyaṇa parātparaṁbani ninnu sarasavidyalu śhrudulu sāḍam̐gānu sirula nanum̐gūḍidivi śhrī veṁkaḍeśha nīm̐ karuṇagiḍu nenorvam̐galanā vori