Title (Indic)తాము విన్న సుద్దులకు తారుకాణ వచ్చెనంటా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాము విన్న సుద్దులకు తారుకాణ వచ్చెనంటా నాములుగా సెలవుల నవ్వులు నవ్వేరు (॥తాము॥) కామిని నీవద్దనుండి కనుసన్న సేసితేను మోములు చూచుకొనేరు ముదితలెల్లా ఆముకొని నీవంతలో నాకెపాదము దొక్కితే దోమటిఁ దమలోనఁజేతులు చరచేరు (॥తాము॥) చెలి నీసముకమున సిగ్గులు నెరపితేను తల లూఁచుకొనే రిదే తరుణు లెల్లా మలసి యాకెను నీవు మర్మాలు సోఁక వాడితే కులికి వొండొరు లిదె గోళ్ళ నెచ్చరించేరు (॥తాము॥) యింతి నీ చెవులలొను నేకతము లాడితేను సంతోసాన మురిసేరు సతులెల్లాను యింతిలో శ్రీవేంకటేశ యీకెను నీవు గూడితే పంతము లొకరొకరు పచారించుకొనేరు English(||pallavi||) tāmu vinna suddulagu tārugāṇa vachchĕnaṁṭā nāmulugā sĕlavula navvulu navveru (||tāmu||) kāmini nīvaddanuṁḍi kanusanna sesidenu momulu sūsugŏneru mudidalĕllā āmugŏni nīvaṁtalo nāgĕbādamu dŏkkide domaḍim̐ damalonam̐jedulu saraseru (||tāmu||) sĕli nīsamugamuna siggulu nĕrabidenu tala lūm̐sugŏne ride taruṇu lĕllā malasi yāgĕnu nīvu marmālu som̐ka vāḍide kuligi vŏṁḍŏru lidĕ goḽḽa nĕchchariṁcheru (||tāmu||) yiṁti nī sĕvulalŏnu negadamu lāḍidenu saṁtosāna muriseru sadulĕllānu yiṁtilo śhrīveṁkaḍeśha yīgĕnu nīvu gūḍide paṁtamu lŏgarŏgaru pasāriṁchugŏneru