Title (Indic)ఆచార్యుఁ డొక్కఁడే యదె నీకు నొప్పగించె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆచార్యుఁ డొక్కఁడే యదె నీకు నొప్పగించె నేచి నన్ను రక్షించేది యిఁక నీ చేతిది (॥ఆచా॥) వరుసఁ బుణ్యము లెల్లా స్వర్గమున కొప్పగించు సరుసనే చదువులు సంశయముల కొప్పించు సురలఁ బూజించుపూజ క్షుద్రవిద్యల కొప్పించు కెరలి నీ కృప కొప్పగించ నెవ్వరు లేరు (॥ఆచా॥) ఘనసంకల్పములు భోగములకు నొప్పగించు పొనిగి కర్మము లెల్లా పుట్టుగుల కొప్పగించు ధనము లంపటముల తగులున కొప్పగించు కినిసి నీ సేవ కొప్పగించ నెవ్వరు లేరు (॥ఆచా॥) సారె నేర్చిన నేర్పులు సంసారమున కొప్పించు అరయఁ గోరికె లెల్లా నజ్ఞానమున కొప్పించు ధారుణి శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి కేరి నీ దాస్యాన కొప్పగించ నెవ్వరు లేరు English(||pallavi||) āsāryum̐ ḍŏkkam̐ḍe yadĕ nīgu nŏppagiṁchĕ nesi nannu rakṣhiṁchedi yim̐ka nī sedidi (||āsā||) varusam̐ buṇyamu lĕllā svargamuna kŏppagiṁchu sarusane saduvulu saṁśhayamula kŏppiṁchu suralam̐ būjiṁchubūja kṣhudravidyala kŏppiṁchu kĕrali nī kṛpa kŏppagiṁcha nĕvvaru leru (||āsā||) ghanasaṁkalbamulu bhogamulagu nŏppagiṁchu pŏnigi karmamu lĕllā puṭṭugula kŏppagiṁchu dhanamu laṁpaḍamula taguluna kŏppagiṁchu kinisi nī seva kŏppagiṁcha nĕvvaru leru (||āsā||) sārĕ nersina nerbulu saṁsāramuna kŏppiṁchu arayam̐ gorigĕ lĕllā najñānamuna kŏppiṁchu dhāruṇi śhrīveṁkaḍeśha taga nannu nelidivi keri nī dāsyāna kŏppagiṁcha nĕvvaru leru