Title (Indic)ఇచ్చితివి తొల్లే నాకు యియ్యఁగల వన్నియును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇచ్చితివి తొల్లే నాకు యియ్యఁగల వన్నియును మచ్చిక నీ శరణన్న మాత్రమే చాలూ (॥ఇచ్చి॥) సామీప్యము నడుగ సారూప్యము నడుగ కామించి సాయుజ్యసాలోక్యము లడుగ భూమిఁ గాని పాతాళంబునఁ గాని దివిఁ గాని సామాన నీదాసులతో సహవాస మియ్యవే (॥ఇచ్చి॥) కాయసిద్ది నడుగ కర్మఫల మడుగ ఆయడ దేవ పట్టము లవి యడుగ యీయడ నేఁడే కాని యింకొక్కనాఁడైనాఁగాని చేయార నీ దాసులసేవ నాకు నియ్యవే (॥ఇచ్చి॥) దేవుఁడవు నీవే మాకుఁ దెలిపె యాచార్యులు శ్రీ వైష్ణువులే గతి చిక్కినవేళ శ్రీ వేంకటేశ్వర జీవము బారము నీది పావన మైతి మింక పలు చింత లేల English(||pallavi||) ichchidivi tŏlle nāgu yiyyam̐gala vanniyunu machchiga nī śharaṇanna mātrame sālū (||ichchi||) sāmīpyamu naḍuga sārūpyamu naḍuga kāmiṁchi sāyujyasālokyamu laḍuga bhūmim̐ gāni pādāḽaṁbunam̐ gāni divim̐ gāni sāmāna nīdāsulado sahavāsa miyyave (||ichchi||) kāyasiddi naḍuga karmaphala maḍuga āyaḍa deva paṭṭamu lavi yaḍuga yīyaḍa nem̐ḍe kāni yiṁkŏkkanām̐ḍainām̐gāni seyāra nī dāsulaseva nāgu niyyave (||ichchi||) devum̐ḍavu nīve māgum̐ dĕlibĕ yāsāryulu śhrī vaiṣhṇuvule gadi sikkinaveḽa śhrī veṁkaḍeśhvara jīvamu bāramu nīdi pāvana maidi miṁka palu siṁta lela