Title (Indic)యిందుముఖిఁ గరుణించు మింతట నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) యిందుముఖిఁ గరుణించు మింతట నీవు యెందాఁకా విన్నవించేము యింకా నీకూ (॥॥) మగువకు నీ విచ్చిన మాటపట్టు దలఁచుకో తగిన చుట్టరికము దలఁచుకో మొగి నాపె యెడకు నీ మొగమోట దలఁచుకో నగుతా సరసమాడే ననుపు దలఁచుకో (॥॥) పడఁతిపై నీవు సేసేబత్తి యైనాఁ దలఁచుకో తడఁబడే రతి పొందు దలఁచుకో కడు బుజ్జగించే నీ కరుణ దలఁచుకో బడివాయకుండేటి నీ భావము దలఁచుకో (॥॥) అలమేల్మంగకు రేఁచే యాస లిట్టే తలఁచుకో తలకొన్న నీ వేడుక దలఁచుకో యెలమి శ్రీ వేంకటేశ యీకె నిట్టే యేలితివి పిలిచి మన్నించే నీ బిరుదు దలఁచుకో. English(||pallavi||) yiṁdumukhim̐ garuṇiṁchu miṁtaḍa nīvu yĕṁdām̐kā vinnaviṁchemu yiṁkā nīgū (||||) maguvagu nī vichchina māḍabaṭṭu dalam̐sugo tagina suṭṭarigamu dalam̐sugo mŏgi nābĕ yĕḍagu nī mŏgamoḍa dalam̐sugo nagudā sarasamāḍe nanubu dalam̐sugo (||||) paḍam̐tibai nīvu sesebatti yainām̐ dalam̐sugo taḍam̐baḍe radi pŏṁdu dalam̐sugo kaḍu bujjagiṁche nī karuṇa dalam̐sugo baḍivāyaguṁḍeḍi nī bhāvamu dalam̐sugo (||||) alamelmaṁgagu rem̐se yāsa liṭṭe talam̐sugo talagŏnna nī veḍuga dalam̐sugo yĕlami śhrī veṁkaḍeśha yīgĕ niṭṭe yelidivi pilisi manniṁche nī birudu dalam̐sugo.