Title (Indic)ఆసలును రేసులను అవి రెండు నేలే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసలును రేసులను అవి రెండు నేలే కాసు సేయనిపనికి కాఁతాళ మేలే (॥అలును॥) అలిగినవాఁడు తా నారడనే వుండుఁ గాక పిలిచి వాదుకు వచ్చి పెనఁగ నేలే కలయనివాఁడు తాను కడు వాసి నుండుఁ గాక వొలిసి దగ్గరి తగవుకుఁ దియ్య నేలే (॥ఆలును॥) మాటలాడనివాఁడు తా మారుమో మై వుండుఁ గాక తేటలుగా సారె మమ్ముఁ దిట్టఁగ నేలే నీటున నుండెటివాఁడు నిక్కము బిగుసుఁ గాక చీటికి మాటికి మాపైఁ జెయి చాఁచ నేలే (॥ఆలును॥) కాఁకలు సేసెటివాఁడు కన్నులనె చూచుఁ గాక యేఁకటఁ గాఁగిలించీ నన్నింతలో నేలే వేఁకపు శ్రీవెంకటాద్రివిభుఁ డిట్టె నన్నుఁ గూడె మాఁకువలె నన్ను మేను మరపించ నేలే English(||pallavi||) āsalunu resulanu avi rĕṁḍu nele kāsu seyanibanigi kām̐tāḽa mele (||alunu||) aliginavām̐ḍu tā nāraḍane vuṁḍum̐ gāga pilisi vādugu vachchi pĕnam̐ga nele kalayanivām̐ḍu tānu kaḍu vāsi nuṁḍum̐ gāga vŏlisi daggari tagavugum̐ diyya nele (||ālunu||) māḍalāḍanivām̐ḍu tā mārumo mai vuṁḍum̐ gāga teḍalugā sārĕ mammum̐ diṭṭam̐ga nele nīḍuna nuṁḍĕḍivām̐ḍu nikkamu bigusum̐ gāga sīḍigi māḍigi mābaim̐ jĕyi sām̐sa nele (||ālunu||) kām̐kalu sesĕḍivām̐ḍu kannulanĕ sūsum̐ gāga yem̐kaḍam̐ gām̐giliṁchī nanniṁtalo nele vem̐kabu śhrīvĕṁkaḍādrivibhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ mām̐kuvalĕ nannu menu marabiṁcha nele