Title (Indic)ఏ మంచిదాన నై నీయెదుట నుండే నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ మంచిదాన నై నీయెదుట నుండే నేను వేమారు నూదితేఁ జల్ల వేఁడియై తోఁచురా (॥ఏమంచి॥) నేనే మనిన నీకు నెరుసు లై తోఁచీని మౌనాన నుండేఁ గాని మాఁట లాడించకురా వూని నే దొలుతె నాకు వొల్లనివాన నింతే తేనెలు వోయఁ బోయినా తెగి చేఁదే తోచురా (॥ఏ మంచి॥) కడునే దగ్గరి యుంటె కావ లై తోఁచీని యెడసి వుండేఁ గాని యిట్టె పిలువకురా గొడవ వెట్టుక నేను గుండెబెద రైనదాన నడుమను గోర గీరినా నే రై పారురా (॥ఏమంచి॥) పైకొని కాఁగిలించి బలుము లై తోఁచీని యేకతాన నుండేఁ గాని యిక్కువ రేఁచకురా యీకడ శ్రీవెంకటేశ యెనసితిఁ గాని నిన్నె నీకు నే నిజ మాడితె నిష్ణూరమై తోఁచురా English(||pallavi||) e maṁchidāna nai nīyĕduḍa nuṁḍe nenu vemāru nūdidem̐ jalla vem̐ḍiyai tom̐surā (||emaṁchi||) nene manina nīgu nĕrusu lai tom̐sīni maunāna nuṁḍem̐ gāni mām̐ṭa lāḍiṁchagurā vūni ne dŏludĕ nāgu vŏllanivāna niṁte tenĕlu voyam̐ boyinā tĕgi sem̐de tosurā (||e maṁchi||) kaḍune daggari yuṁṭĕ kāva lai tom̐sīni yĕḍasi vuṁḍem̐ gāni yiṭṭĕ piluvagurā gŏḍava vĕṭṭuga nenu guṁḍĕbĕda rainadāna naḍumanu gora gīrinā ne rai pārurā (||emaṁchi||) paigŏni kām̐giliṁchi balumu lai tom̐sīni yegadāna nuṁḍem̐ gāni yikkuva rem̐sagurā yīgaḍa śhrīvĕṁkaḍeśha yĕnasidim̐ gāni ninnĕ nīgu ne nija māḍidĕ niṣhṇūramai tom̐surā