Title (Indic)ఆ సుద్దులేల తడవే వాయలేవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ సుద్దులేల తడవే వాయలేవయ్య సేసితిని చెప్పినటె చేకొనవయ్యా (॥ఆసుద్దులేల॥) వున్నతి నీవద్దఁ బాయకుండినదె నేరుపు నిన్నుఁబాసి వుండినదె నేరమి అన్నియు నిన్ను వెనక ననఁగానేమి చెన్నుమీరె గతజలసేతుబంధాలు (॥ఆసుద్దులేల॥) సరి నిన్నుఁ బొగడేదె జాణతనము కరి కరిఁబెట్టేదె గబ్బితనము యెరవెల్లఁ బాసె దిఁకనేమి మరలి వెదకు టెండమావులనీళ్లు (॥ఆసుద్దులేల॥) చక్క నీమోము చూచుటె సరసము వెక్కసపు మారుమోమె విరసము గక్కన శ్రీవెంకటేశ కలసితివి యిక్కువ లన్నియు నింక నింటిలోనిధానము English(||pallavi||) ā suddulela taḍave vāyalevayya sesidini sĕppinaḍĕ segŏnavayyā (||āsuddulela||) vunnadi nīvaddam̐ bāyaguṁḍinadĕ nerubu ninnum̐bāsi vuṁḍinadĕ nerami anniyu ninnu vĕnaga nanam̐gānemi sĕnnumīrĕ gadajalasedubaṁdhālu (||āsuddulela||) sari ninnum̐ bŏgaḍedĕ jāṇadanamu kari karim̐bĕṭṭedĕ gabbidanamu yĕravĕllam̐ bāsĕ dim̐kanemi marali vĕdagu ṭĕṁḍamāvulanīḽlu (||āsuddulela||) sakka nīmomu sūsuḍĕ sarasamu vĕkkasabu mārumomĕ virasamu gakkana śhrīvĕṁkaḍeśha kalasidivi yikkuva lanniyu niṁka niṁṭilonidhānamu