Title (Indic)అన్నిటికిఁ గలవట అందుకులేవా నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అన్నిటికిఁ గలవట అందుకులేవా నీవు నిన్ను నీవె యెంచుకొంటే నేరవా యీపనులు (॥అన్ని॥) నవ్వులకు నొకమాట నంటున నీతో నాడితే యివ్వల నందుకుఁగాను యెగ్గుపట్టేవు రవ్వనవాఁడవుగావా రాజవుగావా మున్నే అవ్వల నెంచిచూచితే నందుకునుఁ దగవా (॥అన్ని॥) చెలిమితో నొకమాఁటు చెక్కుచేత నూఁదితేను కలఁగి నీలోనీవే కాఁతాళించేవు వలపు నీసొమ్ముగాదా వాడికవాఁడవుగావా అలవాటు నీకులేదా అందుకునుఁ దగవా (॥అన్ని॥) చనవుల నొకమాఁటు చన్నుల నేనొత్తితేను కొనచూపులనే చూచి కూడితి విట్టే విను శ్రీ వెంకటాద్రి గోవిందుఁడవు నీవుగావా అనిపించుకో మాచే నందుకునుఁ దగవా English(||pallavi||) anniḍigim̐ galavaḍa aṁdugulevā nīvu ninnu nīvĕ yĕṁchugŏṁṭe neravā yībanulu (||anni||) navvulagu nŏgamāḍa naṁṭuna nīdo nāḍide yivvala naṁdugum̐gānu yĕggubaṭṭevu ravvanavām̐ḍavugāvā rājavugāvā munne avvala nĕṁchisūside naṁdugunum̐ dagavā (||anni||) sĕlimido nŏgamām̐ṭu sĕkkuseda nūm̐didenu kalam̐gi nīlonīve kām̐tāḽiṁchevu valabu nīsŏmmugādā vāḍigavām̐ḍavugāvā alavāḍu nīguledā aṁdugunum̐ dagavā (||anni||) sanavula nŏgamām̐ṭu sannula nenŏttidenu kŏnasūbulane sūsi kūḍidi viṭṭe vinu śhrī vĕṁkaḍādri goviṁdum̐ḍavu nīvugāvā anibiṁchugo māse naṁdugunum̐ dagavā