Title (Indic)ఆయములకెల్లా గురి అతనుని బాణములు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయములకెల్లా గురి అతనుని బాణములు చాయ చూచెకొమ్మనవె జామెక్కె నిపుడు (॥ఆయ॥) తలపోఁతలకు గురి తాననేనూనిద్దరము పలుకులకెల్లా గురిపంతమొక్కటే సెలవి నవ్వులకును చెలులిందరును గురి తెలుకో రమ్మనవే తెల్లవారెనిపుడు (॥ఆయ॥) తగులాయాలకు గురి తననాసందిపొందులు పగటులకెల్లా గురి పచ్చిసేఁతలు అగపడ్డందుకు మేని అడియాలములు గురి మొగమేది రమ్మనవే మువ్వరజామెక్కెను (॥ఆయ॥) ఇచ్చిన కాఁగిళ్ళ గురి యిద్దరితమకములు విచ్చనవీళ్ళకు గురి వింతరతులు యిచ్చట శ్రీవేంకటేశుడింతసేసి కూడెనింకా మచ్చికెతో రమ్మనవే మద్యాన్న మెక్కెను English(||pallavi||) āyamulagĕllā guri adanuni bāṇamulu sāya sūsĕgŏmmanavĕ jāmĕkkĕ nibuḍu (||āya||) talabom̐talagu guri tānanenūniddaramu palugulagĕllā guribaṁtamŏkkaḍe sĕlavi navvulagunu sĕluliṁdarunu guri tĕlugo rammanave tĕllavārĕnibuḍu (||āya||) tagulāyālagu guri tananāsaṁdibŏṁdulu pagaḍulagĕllā guri pachchisem̐talu agabaḍḍaṁdugu meni aḍiyālamulu guri mŏgamedi rammanave muvvarajāmĕkkĕnu (||āya||) ichchina kām̐giḽḽa guri yiddaridamagamulu vichchanavīḽḽagu guri viṁtaradulu yichchaḍa śhrīveṁkaḍeśhuḍiṁtasesi kūḍĕniṁkā machchigĕdo rammanave madyānna mĕkkĕnu