Title (Indic)ఆడినట్టే యాడరాదు ఆపెతో నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడినట్టే యాడరాదు ఆపెతో నీవు వాడికె సరసములే వైపులింతే కొని (॥ఆడి॥) కోమలి తోడుత నీకుఁ గోపగించుకొనరాదు యేమేమి మాటలాడినా నెంతదూరినా కామించి వచ్చినదాపె కైకొని గురియైతివి దామెన నీనగవులే తగవింతే కాని (॥ఆడి॥) అట్టె చలపట్టరాదు అంగనయడకు నీవు ఱట్టు నిన్నెంతసేసి యాఱడిఁ బెట్టినా చుట్టపు వరుస దాపె చొక్కి చనవిచ్చితివి నిట్ట చూపుల మెచ్చులే నేరుపులు గాని (॥ఆడి॥) జోడువాయనిఁకరాదు సుదతి యింటను నీవు యీడు యెంత మీరినాను యెలయించునా వేడుకకతై యాపె శ్రీవేంకటేశుఁడవు నీవు కూడిన యీకూటములే గుణములు గాని English(||pallavi||) āḍinaṭṭe yāḍarādu ābĕdo nīvu vāḍigĕ sarasamule vaibuliṁte kŏni (||āḍi||) komali toḍuda nīgum̐ gobagiṁchugŏnarādu yememi māḍalāḍinā nĕṁtadūrinā kāmiṁchi vachchinadābĕ kaigŏni guriyaidivi dāmĕna nīnagavule tagaviṁte kāni (||āḍi||) aṭṭĕ salabaṭṭarādu aṁganayaḍagu nīvu ṟaṭṭu ninnĕṁtasesi yāṟaḍim̐ bĕṭṭinā suṭṭabu varusa dābĕ sŏkki sanavichchidivi niṭṭa sūbula mĕchchule nerubulu gāni (||āḍi||) joḍuvāyanim̐karādu sudadi yiṁṭanu nīvu yīḍu yĕṁta mīrinānu yĕlayiṁchunā veḍugagadai yābĕ śhrīveṁkaḍeśhum̐ḍavu nīvu kūḍina yīgūḍamule guṇamulu gāni