Title (Indic)ఆ సోదకాఁడవు నీవు అయితే నౌదువుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆ సోదకాఁడవు నీవు అయితే నౌదువుగాక వేసటౌను కొసరితే వేమారు వలెనా (॥ఆసో॥) మోవిపంటిలోననే మోహపురసాలు నించి వేవేలు విందులువెట్టీ వెలఁది నీకు యీవల మమ్మువిందులు యేలడిగేవప్పటిని భావించితే మొగచాటు పైపైనే వలెనా (॥ఆసో॥) కడుమంచి చూపులనే కప్పురాలు నించి నించి యెడయక విడేలిచ్చీ నింతి నీకు వడి మా విడేలకే వరుఁసజేయిచాఁచేవు విడువకైతే కారాలు వేగినంతా వలెనా (॥ఆసో॥) వింతవింతకాఁగిటను వియ్యమందెనాపె నీతో చెంతల నవ్వులు నవ్వీ శ్రీవెంకటేశ బంతి నన్నుఁ గూడితివి పచ్చిగాఁగ బుజ్జగించి కాంతల చుట్టురికము కందువ గావలెనా English(||pallavi||) ā sodagām̐ḍavu nīvu ayide nauduvugāga vesaḍaunu kŏsaride vemāru valĕnā (||āso||) movibaṁṭilonane mohaburasālu niṁchi vevelu viṁduluvĕṭṭī vĕlam̐di nīgu yīvala mammuviṁdulu yelaḍigevappaḍini bhāviṁchide mŏgasāḍu paibaine valĕnā (||āso||) kaḍumaṁchi sūbulane kappurālu niṁchi niṁchi yĕḍayaga viḍelichchī niṁti nīgu vaḍi mā viḍelage varum̐sajeyisām̐sevu viḍuvagaide kārālu veginaṁtā valĕnā (||āso||) viṁtaviṁtagām̐giḍanu viyyamaṁdĕnābĕ nīdo sĕṁtala navvulu navvī śhrīvĕṁkaḍeśha baṁti nannum̐ gūḍidivi pachchigām̐ga bujjagiṁchi kāṁtala suṭṭurigamu kaṁduva gāvalĕnā