Title (Indic)ఆదట దయదలఁచి యాదరించినంతె చాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆదట దయదలఁచి యాదరించినంతె చాలు సోదించి యాతనినంత జోలిఁబెట్టఁ జాలను (॥ఆదట॥) చనవు మెఱయఁబోతే స్వతంత్రము చూపవలె మనవి చెప్పఁగఁబోతే మారు మాట్లాడవలె ననుపు నడపఁబోతే నగి మందెమేళమౌను ఘనుఁడాతనికి నేనింత గాసిఁబెట్టు నోపను (॥ఆదట॥) బలిమి సేయఁగఁబోతే పట్టి పెనఁగఁగవలె చలము సాధించఁబోతే జంకించవలె అలిగి సొలయఁబోతే అన్నియునుఁ దలఁపౌను చెలువుఁడాతనినంత చిమ్మిరేఁచనోపను (॥ఆదట॥) మేలములాడఁగఁబోతే మీఁదఁ జెయివేయవలె నాలిమొగదాకిరైతే నాయంత నేనుండవలె ఈలీల శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె ఆలరి యాతనినంత అలయించనోపను English(||pallavi||) ādaḍa dayadalam̐si yādariṁchinaṁtĕ sālu sodiṁchi yādaninaṁta jolim̐bĕṭṭam̐ jālanu (||ādaḍa||) sanavu mĕṟayam̐bode svadaṁtramu sūbavalĕ manavi sĕppam̐gam̐bode māru māṭlāḍavalĕ nanubu naḍabam̐bode nagi maṁdĕmeḽamaunu ghanum̐ḍādanigi neniṁta gāsim̐bĕṭṭu nobanu (||ādaḍa||) balimi seyam̐gam̐bode paṭṭi pĕnam̐gam̐gavalĕ salamu sādhiṁcham̐bode jaṁkiṁchavalĕ aligi sŏlayam̐bode anniyunum̐ dalam̐paunu sĕluvum̐ḍādaninaṁta simmirem̐sanobanu (||ādaḍa||) melamulāḍam̐gam̐bode mīm̐dam̐ jĕyiveyavalĕ nālimŏgadāgiraide nāyaṁta nenuṁḍavalĕ īlīla śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone nannum̐gūḍĕ ālari yādaninaṁta alayiṁchanobanu