Title (Indic)లంపుగుబ్బు గొల్లెతల లంజకాఁడ నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) లంపుగుబ్బు గొల్లెతల లంజకాఁడ నీ యింపులే వెదకఁబట్టీ నెట్లరా వోరి! (॥లంపు॥) చెప్పరాని వేడుకల సిగ్గులనే నిన్నాళ్లు ఉప్పతిల్లుం గోరికల నుంటిం గాని ఇప్పు డింతనిలువలే నేమిసేతు నీచిత్త మెప్పుడు గాని రాదో యెట్లరా వోరి (॥లంపు॥) చిల్లర సింగారాలు చెలులు సేయఁగ నేను వొల్లనని యిన్నాళ్లు నుంటిం గాని మల్లెపూవు వంటినన్ను మాసిన చీర తోడ నిల్లు వెళ్లకుండఁ జేసి తెట్లరా వోరి! (॥లంపు॥) కమ్మ నిపానుపున నీ కౌఁగిటలో నిన్నాళ్లు ఉమ్మగింపుమేనితో నుంటిం గాని దిమ్మరిసేఁతలతోడి తిరువేంకటేశ! నీ యెమ్మె లింకా మానలే వెట్లరా వోరి English(||pallavi||) laṁpugubbu gŏllĕdala laṁjagām̐ḍa nī yiṁpule vĕdagam̐baṭṭī nĕṭlarā vori! (||laṁpu||) sĕpparāni veḍugala siggulane ninnāḽlu uppadilluṁ gorigala nuṁṭiṁ gāni ippu ḍiṁtaniluvale nemisedu nīsitta mĕppuḍu gāni rādo yĕṭlarā vori (||laṁpu||) sillara siṁgārālu sĕlulu seyam̐ga nenu vŏllanani yinnāḽlu nuṁṭiṁ gāni mallĕbūvu vaṁṭinannu māsina sīra toḍa nillu vĕḽlaguṁḍam̐ jesi tĕṭlarā vori! (||laṁpu||) kamma nibānubuna nī kaum̐giḍalo ninnāḽlu ummagiṁpumenido nuṁṭiṁ gāni dimmarisem̐taladoḍi tiruveṁkaḍeśha! nī yĕmmĕ liṁkā mānale vĕṭlarā vori