Title (Indic)ఆయలేరే యేమి చెప్పి రాతని సుద్దులు నాకూ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయలేరే యేమి చెప్పి రాతని సుద్దులు నాకూ తాయిమక్కళాలె కాక దయ గద్దా తనకు (॥ఆయ॥) కన్నులఁ జూడనె పట్టె కాఁకలు సేయనె పట్టె ఇన్నిటా తా నన్నుఁ గూడే దెప్పుడో కాని సన్నలు సేయనే పట్టె చవులు చూపనే పట్టె వెన్నెలబాయిటికి రా వేళ లేదు తనకు (॥ఆయ॥) నవ్వులు నవ్వనే పట్టె నాలిసేయనే పట్టె ఇవ్వల నన్నుం గూడేది యెన్నఁడే తాను పువ్వుల వేయనే పట్టె బుజ్జగించనే పట్టె పవ్వళించం బ్రొద్దులేదు పను లేలే తనకు (॥ఆయ॥) మాటలాడనే పట్టె మనసు చూడనే పట్టె ఈటునం గాలు దొక్కేది యెన్నఁడే తాను పాటించి శ్రీ వెంకటాదిపతి నన్ను నురముపై తేటలుగా నెక్కించుక దించ నెడలేదు English(||pallavi||) āyalere yemi sĕppi rādani suddulu nāgū tāyimakkaḽālĕ kāga daya gaddā tanagu (||āya||) kannulam̐ jūḍanĕ paṭṭĕ kām̐kalu seyanĕ paṭṭĕ inniḍā tā nannum̐ gūḍe dĕppuḍo kāni sannalu seyane paṭṭĕ savulu sūbane paṭṭĕ vĕnnĕlabāyiḍigi rā veḽa ledu tanagu (||āya||) navvulu navvane paṭṭĕ nāliseyane paṭṭĕ ivvala nannuṁ gūḍedi yĕnnam̐ḍe tānu puvvula veyane paṭṭĕ bujjagiṁchane paṭṭĕ pavvaḽiṁchaṁ brŏdduledu panu lele tanagu (||āya||) māḍalāḍane paṭṭĕ manasu sūḍane paṭṭĕ īḍunaṁ gālu dŏkkedi yĕnnam̐ḍe tānu pāḍiṁchi śhrī vĕṁkaḍādibadi nannu nuramubai teḍalugā nĕkkiṁchuga diṁcha nĕḍaledu